సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రంలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు ఎంపిపి పార్వతి కొండా నాయక్,ఎం ఈ ఓ చత్రు నాయక్ ఆధ్వర్యంలో ఎం ఆర్ సి కార్యాలయంలో పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమంలో ఎంపిపి పార్వతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ విద్య అందించటమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రతి పేద వాడు కూడా ఉన్నత చదువులు చదివి పై స్థాయిలో విజయం సాధించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలోని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం ఆర్ సి సిబ్బంది పాల్గొన్నారు.
-----------------------
Admin