Sunday, 13 September 2026 12:37:39 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పీపుల్స్‌మార్చ్‌ యాత్రలో సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్కతో కలసి శంకర్ అడుగులు...

Date : 13 May 2023 12:24 AM Views : 476

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : తొమ్మిదేళ్ల కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వనాశనమైందని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, షాద్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వీర్లపల్లి శంకర్ ధ్వజమెత్తారు. ‘పీపుల్స్‌మార్చ్‌’ యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ వద్ద సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్కతో కలసి "శంకర్" అడుగులు వేశారు. రేపు శనివారం షాద్ నగర్ నియోజకవర్గం లోని కొందూరు మండలంలో భట్టి పీపుల్స్ మార్చి యాత్ర ప్రవేశిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు మండలంలోని చెలుక చిలకమర్రిలో పాదయాత్రకు స్వాగతం పలకనున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణతో తమ బతుకులు బాగుపడతాయని భావించిన ప్రజల ఆశలను కేసీఆర్‌ ఆడియాసలు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి కేసీఆర్‌ దోపిడీ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపుని చ్చారు. ‘పీపుల్స్‌మార్చ్‌’ పేరిట భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ప్రజలు మంచి స్పందన లభిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనపై విరచుకుపడ్డారు. యావత్‌ తెలంగాణ సమాజ కలలను కేసీఆర్‌ కల్లలు చేశాడన్నారు. దుర్మార్గపు పాలనతో ప్రజలు వంచనకు గురయ్యారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అన్ని వర్గాల బతుకుల్లో వెలుగులు నిండుతాయనే భావన ఏర్పడిందన్నారు. అయితే రాష్ట్ర సంపదంతా కేసీఆర్‌ కుటుంబమే దోచుకుం టోందని ఆరోపించారు. దోపిడే లక్ష్యంగా కేసీఆర్‌ పాలన సాగుతుందన్నారు. కేసీఆర్‌ దోపిడీ వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలోకి దిగిందన్నారు. ఇతర రాష్ట్రాల ఎన్నికల ఖర్చును భరిస్తామంటూ కేసీఆర్‌ వ్యాఖ్యలు చేయడమే ఆయన దోపిడీకి నిదర్శనమన్నారు. ఎన్నికల వ్యయాన్ని భరించే డబ్బు కేసీఆర్‌కు ఎక్కడిదని శంకర్ ప్రశ్నించారు. ప్రజలు దీనిని గుర్తించాలన్నారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. నష్టపోయిన పంటను యుద్ధ ప్రాతిపదికన అంచనా వేసి రైతులను నష్టపరిహారం చెల్లించాలన్నారు. కేసీఆర్‌ వ్యూహాత్మకంగానే ధరణిని ప్రవేశపెట్టారని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ పేరిట భూములను దొరలకు కట్టబెట్టే పన్నాగం పన్నారన్నారు. కాంగ్రెస్‌ హయంలో పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములను కేసీఆర్‌ సర్కారు వెనక్కి తీసుకోవడం శోఛనీయమన్నారు. మూడెకరాలు పంపిణీ చేస్తామన్న కేసీఆర్‌ గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను లాక్కో వడం సిగ్గుచేటన్నారు. పరీక్ష పేపర్ల లీకేజీలతో విద్యార్థుల జీవితాలతో కేసీఆర్‌ చెలగాటమడుతున్నారని వ్యాఖ్యానించారు. గెలిపిస్తే మళ్లీ ఇందిరమ్మ రాజ్యమే. కేసీఆర్‌ దోపిడీ పాలన అంతం కావాలంటే కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని శంకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తద్వారా మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వస్తుందన్నారు. అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణ మాఫీ చేస్తామన్నారు. వంట గ్యాస్‌ సిలిండర్‌ను రూ.500లకే అందచేస్తామన్నారు. నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తామని, నిరుద్యోగ భృతి అందచేస్తామనే తదితర హామీలను విక్రమార్క ప్రకటించారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికా రం లోకి రాగానే అదానీ, కేసీఆర్‌ అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు. ఆ సంపదనంతా ప్రజలకు చెందెలా చర్యలు చేపడ తామన్నారు. ఈ పాదయాత్రలో భట్టి విక్రమార్క పలకరిస్తూ.. పరామర్శిస్తూ.. ఉత్సాహంగా పాదయాత్ర చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: