సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు రావలసిన బకాయి బిల్లులు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా జూలై 10 నుంచి 12వ తేదీ వరకు టోకెన్ సమ్మె నిర్వహిస్తున్నామని 12వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని సిఐటియు జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ పేర్కొన్నారు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జి పద్మ అధ్యక్షతన కొత్తగూడెం సిఐటియు కార్యాలయంలో జరిగింది ఈ సమావేశంలో ఎజే రమేష్ మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 15 నెలల క్రితం వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటించిందని నేటి వరకు ఒక్క రూపాయి కూడా అమలు కాలేదని పేర్కొన్నారు 15 నెలల ఎరియర్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఒక్కొక్క పాఠశాలకు 50 వేల నుండి రెండు లక్షల 50 వేల వరకు బిల్లులు బకాయిలు ఉన్నాయని ఈ బకాయిలన్నింటిని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు లేదా మధ్యతరగతి కుటుంబాల చిన్నారులకు పోషకాహారాన్ని అందించడంలో అత్యంత కీలకమైన పాత్ర మధ్యాహ్న భోజన పథకం కార్మికుల నిర్వహిస్తున్నారు మూడు దశాబ్దాలుగా ఈ పథకం అమలులో కార్మికులు చేస్తున్న శ్రమను ప్రభుత్వం గుర్తించడం లేదని విమర్శించారు మహిళా కార్మికుల తో వెట్టి చాకిరి చేయిస్తూ శ్రమ దోపిడి చేస్తుందని విమర్శించారు జూలై 10 నుంచి మూడు రోజులు పాటు జరుగుతున్న టోకెన్ సమ్మె జయప్రదానికి విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠశాల అభివృద్ధి కమిటీలు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు జూలై 10 11 తేదీల్లో మండల కేంద్రాల్లో సమ్మె కొనసాగుతుందని జూలై 12వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహా ధర్నా చేస్తామని పేర్కొన్నారు జూలై మూడో తేదీ నుండి అన్ని పాఠశాలలకు మండల విద్యాశాఖ అధికారులకు సమ్మె నోటీసులు అందజేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా కమిటీ నిర్ణయించింది మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాన్ని విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించాలని తెలిపారు యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జి పద్మ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు ప్రతి మిడ్ డే మీల్ వర్కర్ కు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నుండి గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు సమస్యల పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చూపుతోందని పేర్కొన్నారు నిత్యం నిప్పు దగ్గర ఉంటూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని వంట చేస్తున్నారని అటువంటి కార్మికులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని పేర్కొన్నారు అప్పులు చేసి దళిత గిరిజన పేద బలహీన వర్గాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెడుతున్నారని అటువంటి కార్మికులకు బకాయిలు చెల్లించకుండా దశాబ్ది ఉత్సవాల పేరుతో వందల కోట్లు ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించారు దశాబ్ది ఉత్సవాలకు ఉన్న ప్రాధాన్యత రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తులో లేదా అని ప్రశ్నించారు ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి జిల్లా సహాయ కార్యదర్శి సత్య తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ నాయకులు కే శివమ్మ అరుణ శైలజ క్రాంతి రమాదేవి రాణి తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin