సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ : విద్యుత్ తీగలు తగిలి గేదె మృతి... - అధికారుల నిర్లక్ష్యం తో మూగ జీవాలు మృత్యువాత... విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో మూగజీవాలు మృత్యుఒడిలోకి చేరుకుంటున్న అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలలో నాలుగైదు ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్న ప్రమాద టంచున ఉన్న విద్యుత్ స్తంభాలను సరి చేయడంలో విద్యుత్ అధికారులు విఫలమవుతున్నారని రైతులు అంటున్నారు. సుజాతనగర్ గ్రామపంచాయతీలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన జంగిలి సర్వయ్య కు చెందిన గేదె కరెంట్ షాక్ తగిలి మంగళవారం మృతి చెందింది సుజాతనగర్ గ్రామ పంచాయతీలోని కాపు భద్రా చెరువు కింద గల పంట పొలాల్లో గాలి దుమ్ములకు కరెంటు స్తంభం పై ఉన్న ఇన్సులేటర్ పగిలి కరెంట్ తీగ కిందపడి ఉండడంతో ప్రమాదవశాత్తు మేతకు వెళ్లిన గేద కు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది మృతి చెందిన గేదె విలువ సుమారు 80 వేల రూపాయలు ఉంటుందని రైతు వాపోతున్నాడు జీవనాధారమైన గేదె చనిపోవడంతో దుఃఖంతో కుమిలి పోతున్నాడు వెంటనే ప్రభుత్వం స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు...
-----------------------
Admin