సర్కార్ టీవీ న్యూస్ / మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని యాప్రాల్ ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఉన్న సర్వేనెంబర్ 255 లో గాల గ్రామకంఠం పరిధి ప్రభుత్వ స్థలాన్ని స్థానిక నాయకులు కబ్జాకు పాల్పడుతున్నారంటూ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు... వివరాల్లోకి వెళ్తే 1978 లో అప్పటి గిర్థవర్ భజన మందిర్ కోసం ఒక గుంట స్థలాన్ని కేటాయించడం జరిగింది.. అప్పటినుండి ఎన్నో ప్రభుత్వాలు మారాయి ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు పోయారు భజన మందిర్ నిర్మాణం జరగలేదని ఖాళీగా ఉందంటూ స్థానికంగా ఉన్న నాయకులు ఆ భూమిపై కన్నేసి దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కబ్జాదారుల కొరల నుంచి మా భూమిని రక్షించి మాకు న్యాయం చేయాలంటూ ఆదివారం నాడు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి వారి సమస్యను తెలియపరిచారు.. అంతేకాకుండా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక చొరవ తీసుకొని భజన మందిర్ నిర్మాణం కోసం సహకరించాలంటూ స్థానిక ప్రజలు కోరారు... స్థానిక నాయకుడు మాపై ఎన్నోసార్లు దుర్భాషలాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాకు సహకరించి మందిరం స్థలాన్ని మాకు ఇప్పించగలరని విన్నవించుకున్నారు....
-----------------------
Admin