సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : శ్రీ సత్యసాయి జిల్లా అమడగూరు మండలంలో మాజీ మంత్రి విస్త్రుత పర్యటన, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహణ...కార్యకర్తలకు అండగా పలువురికి పరామర్శ, ఆర్థికసాయం మాజీ మంత్రి మరియు పుట్టపర్తి నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి డా పల్లె రఘునాథ్ రెడ్డి బుధవారం మండలంలో విస్త్రుతంగా పర్యటించారు. మహమ్మదా బాద్ లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపి ప్రభుత్వం తీసుకువచ్చిన జి. ఓ. నెం. 01 ని చీకటి జీఓ గా పేర్కొంటూ అంబేడ్కర్ చిత్ర పటం వద్ద కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మి నారాయణ , జిల్లా అధికార ప్రతినిధి వల్లేపు సోమశేఖర్ సైతం హాజరై పాల్గొన్నారు. అంతకు ముందు గువ్వలపల్లిలో మళ్లప్ప అనే కార్యకర్త తండ్రి ఇటీవల మరణించిన నేపథ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించిన ఆర్థికసాయం చేశారు, అలాగే ప్రమాదానికి గురైన శ్రీరాములును పరామర్శించి ఆరోగ్య స్థితి తెలుసుకొని ఆర్థికసాయం చేశారు. గుండువారి పల్లిలో జరిగిన పలు శుభకార్యాలకు హాజరై పలువురిని ఆశీర్వదించారు. చీకురేవుల పల్లిలో జరిగిన పెద్దక సరోజమ్మ వైకుంఠ సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.
-----------------------
Admin