Tuesday, 15 September 2026 04:42:19 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లేవు, ఎమ్మెల్యేకు క్యాంపు కార్యాలయం అవసరమా..?

Date : 01 June 2023 09:05 AM Views : 386

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : రాబోయే ఎన్నికల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ లు ప్రజల చేతిలో చిత్తుగా ఓడిపోతారనే భయం పట్టుకుందని అందుకే ఎవరు ఏం పీకలేరు అంటూ నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారంటూ బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ లు షాద్ నగర్ సభలో బిజెపిపై చేసిన విమర్శలపై స్థానిక నాయకులు స్పందించారు. బుధవారం షాద్ నగర్ దేవీ గ్రౌండ్ కాన్ఫరెన్స్ హాల్లో షాద్ నగర్ బిజెపి అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ టి.విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, సీనియర్ నేతలు కమ్మరి భూపాలాచారి, దేపల్లి అశోక్ గౌడ్, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, అందే బాబయ్యలు మీడియాతో మాట్లాడారు. నిన్న జరిగిన బిఆర్ఎస్ సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాజకీయ అవగాహన రాహిత్యం స్పష్టంగా కనిపిస్తుందని వారు అన్నారు. తెలంగాణలో బిజెపి చొరబడిందని మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనం అన్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పుట్టిందో ముందు తెలుసుకోవాలన్నారు. నిన్న మొన్న వచ్చిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు బిజెపిని ప్రశ్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇలాఖాలో ఏం జరుగుతుందో? తమకు తెలియదా అని ప్రశ్నించారు. మహబబ్ నగర్ లో రౌడీయిజం, దౌర్జన్యం అక్రమాలతో రాజ్యాన్ని ఏలుతున్న శ్రీనివాస్ గౌడ్ బిజెపిని విమర్శించే స్థాయి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు కళ్ళకు కట్టినట్టు చూపెడతామని దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. నియోజక వర్గంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వడానికి చేతులు రావు కానీ ఎమ్మెల్యేకు అందమైన క్యాంపు భవంతిని నిర్మించి ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అందమైన భవనం నియోజకవర్గంలో క్యాంపు కార్యాలయం ఇలా రెండు చోట్ల వారి పాలన సౌలభ్యం కోసమే తహతహలాడుతున్న ప్రభుత్వం.. పేద ప్రజలు గత 9ఏళ్లుగా ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా ఇవ్వకపోవడం సిగ్గుగా కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఎంత మంది ఉద్యమకారులను ఆదుకున్నారో ఎంతమంది జర్నలిస్టులను ఆదుకున్నారో ఎంతమంది అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో అనేక సమస్యలతో ప్రజలు బాధపడుతుంటే సొంత ఆర్భాటాల కోసం లక్షల రూపాయలు తగలేస్తున్న పాలకులను ఏమనాలని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చింది ఎవరో దానికి పార్లమెంటులో మద్దతు తెలియజేసింది ఎవరో తెలియదా అని ప్రశ్నించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ఒక కోటి రూపాయలతో క్యాంపు కార్యాలయం కట్టుకున్న ఎమ్మెల్యేకు నియోజకవర్గ పేద ప్రజల సమస్యలు పట్టవా? అని ప్రశ్నించారు. నియోజక వర్గంలో పేదలు చెట్ల కింద పుట్ల కింద ఉంటే ఎమ్మెల్యే మాత్రం తన పరిపాలన సౌలభ్యం కోసం భవంతిని నిర్మించుకోవడం ఆశ్చర్యంగా ఉందని పేదల ఉసురు తగిలి వచ్చే ఎన్నికల్లో పోతారని శాపనార్ధాలు పెట్టడం గమనర్హం. నియోజకవర్గంలో ఎంతమంది పేదలు మురికి కాలువల వద్ద చిన్న గుడిసెల్లో అడ్డమైన స్థలాల్లో కాలం వెళ్లదీస్తున్నారని ఇది ఎమ్మెల్యేకు కనిపించడం లేదా అని ఘాటుగా ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆయన కుమారుల ప్రస్తావన గురించి అందరికీ తెలుసు అని మంత్రి అన్నట్టు ఏం పీకుతారో అనీ వారినీ అధికారం నుండి పీకే చూపిస్తామని సవాల్ విసిరారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగంలో అక్రమాలకు పాల్పడి సస్పెండ్ అయితే ఉద్యమం పేరుతో ప్రజల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలుపొందారని మంత్రి అయ్యాక అహం నెత్తికెక్కిందని అన్నారు. ఆనాడు తెలంగాణ ధూంధాంలో బిజెపి నాయకులతో కలిసి పాలుపంచుకున్న మంత్రికి బిజెపి ఎక్కడ ఉందో తెలియదా అని వారు ప్రశ్నించారు. అధికారం అనే కత్తి పట్టుకుని వీరంగం ఆడుతున్న బీఆర్ఎస్ నాయకులకు భవిష్యత్తులో గట్టి బుద్ధి చెప్తామని అన్నారు. తప్పకుండా ఏం పీకాలో అన్ని పీకి చూపిస్తామని అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అన్యాయాలను అక్రమాలను పీకేస్తామని ఆయన కుమారుల దౌర్జన్యాలను పీకేస్తామని హెచ్చరించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నియోజకవర్గాన్ని శాసిస్తున్న తీరును వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందు కళ్లకు కట్టినట్టు చూపిస్తామని అన్నారు. ఎవరి చరిత్ర ఏమిటో చూపిస్తామని మంత్రి ప్రతిపక్షాలవి ఏం పీకుతారో తాము కూడా చూస్తామని ప్రతి సవాల్ విసిరారు. చౌడమ్మ గుట్ట వివాదంపై స్పందించిన బిజెపి. చౌడమ్మ యాడి దేవాలయం కూల్చివేత అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కూల్చివేత ఘటనలపై బిజెపి నాయకులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. పోలీసులు సంబంధిత వ్యక్తులను కాపాడుతున్నారని రాజకీయాలకు తలొగ్గి వారిని అరెస్టు చేయడం లేదంటూ విమర్శలు వ్యక్తం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నేలమట్టం చేసిన వారు మట్టిలో కలిసిపోతారని అన్నారు. శివుని సాక్షిగా అక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలుసని, ఎవరు అక్రమాలకు పాల్పడ్డారో వారు మట్టి కొట్టుకుపోతారని అన్నారు. చౌడమ్మ యాడి దేవాలయ భూముల రక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేయబోతున్నట్టు మరోసారి ప్రకటించారు. దేవాలయాలను నేలమట్టం చేసి అక్రమాలకు పాల్పడలేదని భుజాలు తడుముకుంటున్న నాయకుల బండారం బయటపెడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ ఎవరికి భయపడే ప్రసక్తే లేదని ఎవరిని వదలబోమని, నియోజక వర్గంలో అన్యాలను అక్రమాలను పీకే చూపిస్తామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో బిజెపి స్థానిక నాయకులు మల్చాలం మురళి, రిషికేష్, ఇస్నాతి శ్రీనివాస్, వంశీ, మనోహర్ రెడ్డి మోహన్ సింగ్, చిట్టెం లక్ష్మీకాంత్ రెడ్డి, ఆకుల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :