Thursday, 30 July 2026 10:34:12 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఖమ్మం జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు...

Date : 19 January 2023 12:35 AM Views : 740

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. బీఆర్ఎస్ సభలో మాట్లాడుతూ జిల్లాలోని 589 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. మేజర్‌ గ్రామ పంచాయతీలుగా ఉన్న గ్రామాలకు ఒక్కోదానికి రూ.10 కోట్లు, ఖమ్మం మున్సిపాలిటీకి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మధిర, వైరా, సత్తుపల్లికి రూ.30 కోట్ల చొప్పున, ఖమ్మంలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కాలేజీని మంజూరు చేస్తామన్నారు. అలాగే సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అజెండాలోని అంశాలను త్వరలో కులంకషంగా.. చర్చించి విశ్లేషించి ప్రకటిస్తామని అన్నారు. అయితే ఖమ్మం బహిరంగ సభ సాక్షిగా..ఎల్ఐసీ మరియు విశాఖ ఉక్కు కర్మాగారాలను జాతీయం చేస్తామని.. దళిత బంధుని దేశమంతా అమలు చేస్తామని.. దేశమంతా మంచినీరు అందిస్తామన్నారు. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ .. ఈసారి రైతు సర్కారును దేశం గుమ్మంలో నిలవడం... మోదీ ఇంటికి వెళ్లడం ఖాయమని,..బిజెపి ది ప్రైవేటిజేషన్ పాలసీ అయితే .. బిఆర్ఎస్ ది నేషనలలైజేషన్ అభివృద్ధియే ప్రధాన అజెండా అని అన్నారు. ఖమ్మం హెడ్‌ క్వార్టర్‌లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.అలాగే బుధవారం సభలో ఆయన మాట్లాడుతూనెల రోజుల్లోనే ఇండ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్‌ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల గురించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలం లేకుంటే ప్రభుత్వమే భూమిని సేకరించి జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తుందని ప్రకటించారు. ఫొటో జర్నలిస్టులు, కెమెరా జర్నలిస్టలందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. సభలో సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ”రాజకీయాలు జరుగుతుంటాయి. గెలుపు ఓటములు సహజం. కానీ భారత దేశం , భారత సమాజం లక్ష్యం ఏంటి. భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందా. దారి తప్పిందా. బిత్తరపోయి గత్తర పడుతుందా. ఏం జరుగుతా ఉంది ఈ దేశంలో. ఈ విషయం మీద నా అంతరాత్మ అనేక రకాలుగా కలిచి వేస్తా ఉంది. అందరూ సీరియస్‌గా ఆలోచించాలి” అని పిలుపునిచ్చారు. దేశంలో ఎవరిని అడుక్కునే అవసరం లేనటువంటి, ఏ ప్రపంచ బ్యాంకు తీసుకునే అవసరం లేనటువంటి. ఏ అమెరికా కాళ్లు మొక్కాల్సిన అవసరం లేనటువంటి. ఏ విదేశీయుల సహాయం అవసరం లేనటువంటి. సహజ సంపద ఈ దేశ ప్రజల సొత్తు అని కేసీఆర్‌ అన్నారు. దేశంలో లక్షల కోట్ల కోట్ల ఆస్తి ఉందని, ఇదంతా ఏమైతుంది అని ప్రశ్నించారు. దేశంలో సంపద లేకుంటే బిక్షం ఎత్తుకుంటే తప్పులేదు. కానీ ఉండి మనం ఎందుకు యాచకులం కావాలని ప్రశ్నించారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :