సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ :పట్టణంలో అమరవీరుల స్మారక భవనంలో జూన్ 11న జరిగే రాజకీయ శిక్షణ తరగతులు కరపత్రం ఆవిష్కరించి వారు మాట్లాడుతు జిల్లా కమిటీ సభ్యులు దుర్గి బ్రహ్మం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీలం. శీను వారు మాట్లాడుతూ హుజూర్నగర్ మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో నిర్వహించు హుజూర్ నగర్ టౌన్. హుజూర్ నగర్. మేళ్లచెరువు. చింతలపాలెం.మఠంపల్లి. మండలాల పార్టీ సభ్యుల స్థాయి రాజకీయ శిక్షణ క్లాసులను జయప్రదం చేయాలని మోడీ రెండు దఫాలు పరిపాలన చేసి అనుసరించిన విధానాల మూలంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన ప్రతిష్ట మస్కబారిందన్నారు మతం కులం పేరుతో రాజకీయాలు చేసిన మోడీని అయోధ్యలో వెనక్కి కొట్టడం శుభపరిమనమని అన్నారు. 400 సీట్లు వస్తాయని విస్తృత ప్రచారం చేసిన మోడీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ కూడా రాలేదని దేశంలో తనకు ఎదురు లేదని ముచ్చటగా మూడోసారి 400 సీట్లతో అధికారంలోకి వస్తానని విర్రవీగిన మోడీకి దేశ ప్రజలు తగిన తీర్పునిచ్చారని అన్నారు. కేంద్రంలో మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక మత తత్వ విధానాలతో దేశంలో ప్రజాస్వామ్యం మంట గల్లీపే ప్రమాదం ఉందన్నారు దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే మోడీని బీజేపీనీ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ప్రజాస్వామ్య శక్తులు ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని అన్నారు.దేశవ్యాప్తంగా రాజకీయాలు వేగంగా మారుతున్నటువంటి సందర్భంలో పార్టీ నాయకులు కార్యకర్తలు చైతన్యం చేయడం కోసం రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజా పోరాటాలకు చైతన్యాన్నికి కేంద్రమైన హుజూర్ నగర్ మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో రాజకీయ శిక్షణ తరగతుల జయప్రదనానికి అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో చిన్నo . వీరమల్లు పాశం. వెంకట్ నారాయణ తురక .వీరయ్య రేపాకుల .వీరస్వామి చింతకాయల. పర్వతాలు పాశం. వీరబాబు శీల .వెంకన్న జి. శీను ఎలక .సోమయ్య ఇంటి. తిరపయ్య ఉప్పతల .గోవిందు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin