సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్టణంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇల్లు కట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు కేటాయించాలని, గతంలో అనర్హులకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇళ్లను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ కొత్తగూడెం ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో కొత్తగూడెం తహశీల్దార్ కార్యాలయం ఎదుట భారీగా మహిళలు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసాని ఐలయ్య మాట్లాడుతూ.... కొత్తగూడెం పట్టణంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇవ్వాలని దానికోసం పట్టణములో 35 ఎకరాల భూమిని గుర్తించామని దానిలో వెంటనే ప్రభుత్వం ఒక్కొక్కరికి 100 గజాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కొత్తగూడెంలో ఇటీవల నిర్మించిన డబుల్ బెడ్రూం ఇల్లు అనర్హులకు కేటాయించారని వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొమరం బీమ్ కాలనిలో పేదలు ఏర్పాటు చేసుకున్న గుడిసెలకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు....
-----------------------
Admin