సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి జడ్ పి హెచ్ ఎస్ స్కూలు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అనుచిత వ్యాఖ్యలు చేయడం, మహిళా ఉపాధ్యాయుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గతంలో ఇతనిపై జిల్లా విద్యాశాఖ అధికారి కి ఫిర్యాదు చేసిన ఇతనిలో మార్పు రాలేదు. నిబంధనలకు విరుద్ధంగా ఉపాధ్యాయులకు జీతాలు కోత కోయడం, వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారానికై వెళ్తే ఎందుకురా నా పాఠశాలకు వస్తున్నారు గాడుదులు కాయడానికి, పందులు మేపడానికి వస్తున్నారా? అని దుర్భాషలాడుతున్నారు. కావున స్థానిక జడ్పిహెచ్ఎస్ మఠంపల్లి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల పట్ల అనుచిత ప్రవర్తనా వైఖరిని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఉపాధ్యాయ ఫెడరేషన్ మఠంపల్లి మండల శాఖ పత్రికా ముఖంగా ఖండిస్తున్నాం. అని తెలిపారు
-----------------------
Admin