సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు ,మండలం విద్యాధికారి ఖాదర్ బాషా వలి మండలం లో ఉన్న ఉపాధ్యాయులందరూ నియమ ,నిబంధనలు, పాటించాలని తెలియజేయడమైనది ఉపాద్యాయులు గా మనం అందరికి అదర్శంగా ఉండాల్సినవాళ్ళం. ముఖ్యంగా మన వద్ద చదువుకుంటున్న పిల్లలకు ఆదర్శంగా, మార్గదర్శకులుగా ఉండవలసినవాళ్ళం. మన విద్య శాఖ నిబంధనలు, సాధ్యాసాధ్యాలు ప్రక్కన పెట్టి ఈ క్రింది విషయాలు ఆత్మవలోకనం చేసుకుందాం...! పాఠశాలకు టైం కు హాజరు కావాలా.... ? అవును. పాఠశాలకు టైంకు హాజరు కావాల్సిందే. అంటే పాఠశాల ఉదయం 9.00 గంటలకు అంటే 9.00 గంటలకు కాదు. కనీసం 15 నిముషాలు ముందే ఉపాధ్యాయులు అందరూ హాజరు కావాలి. తలుపులు తీయడం, తీయించడం, గదులు శుభ్రం చేయించడం, మంచినీరు ఏర్పాట్లు, బెల్ కొట్టించడం వంటి అంశాలు పర్యవేక్షించడం అందరి సమిష్టి బాధ్యత. పాఠశాల అసెంబ్లీ నిర్వహణ ఎలా... ? ప్రధానోపాధ్యాయుని ఆధ్వర్యంలో అసెంబ్లీ విద్యార్థులుకు ఉత్తేజం కలిగేలా వ్యాయమ ఉపాద్యాయునితో కలసి ఉపాద్యాయులు అందరూ కలసి నిర్వహించాలి. విద్యార్థులు అందరూ సకాలంలో అసెంబ్లీకి హాజరు అయ్యేలా చూడడం, ఆలస్యం అయితే ప్రశ్నించడం, అసెంబ్లీలో ఒక ఉపాద్యాయుడు ప్రతి రోజు విద్యార్థుల ను ఉద్దేశించి ప్రవర్తన, క్రమశిక్షణ, చదువు,గేమ్స్ గురించి మాట్లాడడం చేయాలి. ఉపాద్యాయులు తరగతి గదికి ఎప్పుడు హాజరు. కావాలి...? అసెంబ్లీ పూర్తి కాగానే ఉపాధ్యాయులు విద్యార్థుల వెంటే ఆయా తరగతుల కు హాజరు కావాలి. పీరియడ్ సమయం మొత్తం వారితోనే గడపాలి . ఉపాద్యాయులు తరగతి గది నుండి ఎప్పుడు బయటకు రావాలి... ? పీరియడ్ పూర్తి అయిన తర్వాతనే బయటకు రావాలి . అలా వచ్చేటప్పుడు తర్వాతి పీరియడ్ ఉపాద్యాయుడు వచ్చేంతవరకు వేచి ఉండాలి. తర్వాతి పీరియడ్ ఉపాధ్యాయుడు కూడా మొదటి పీరియడ్ ఉపాద్యాయుడు బయటకు (స్టాఫ్ రూమ్ కు) వచ్చేంత వరకు వేచి ఉండక తరగతి గది వద్దకు వెళ్ళాలి. ఇది ఉపాద్యాయుల పరస్పర అవగాహనతో జరగాలి. అంతిమంగా తరగతి గది ఉపాద్యాయుడు లేకుండా ఉండరాదు. విద్యార్థులు క్రమశిక్షణ రాహిత్యానికి అవకాశం లేని విధంగా తరగతి గదులు (పీరియడ్) మారుతూ ఉండాలి. ఉపాద్యాయులు సెలవు పెడితే మిగిలిన ఉపాధ్యాయులు వారి పీరియడ్స్ కు వెళ్లాలా... ? అవును. వెళ్ళాలి. తరగతులు ఖాళీగా ఉండరాదు. ప్రధానోపాధ్యాయులు సెలవు పెట్టిన ఉపాద్యాయుల పీరియడ్స్ ను ఇతర ఉపాద్యాయులకు ఎక్స్ట్రా పీరియడ్స్ వేసి పంపాలి. లేదా ఇతర ఉపాద్యాయులే స్వచ్ఛందముగా వారి పీరియడ్స్ కు వెళ్ళాలి. ఇందు వలన విద్యార్థుల్లో క్రమశిక్షణా రాహిత్యం రాకుండా చూడవచ్చు. ఉపాద్యాయులు తమ సబ్జెక్టు సిలబస్ బోధించు కొనవచ్చు. స్టాఫ్ రూమ్ లో కూర్చుని చేసుకునే విద్యా సంబంధిత పనులను తరగతిలో కూర్చుని (విద్యార్ధులకు ఏదయినా వ్రాత పని వంటివి ఇచ్చి ) పూర్తి చేసుకొనవచ్చు. పాఠశాల లో నిర్వహించ వలసిన ఇతర పనులు (ఆన్లైన్ అటెండెన్స్ కంసోలిడేషన్ , మార్క్స్ ఆన్లైన్, mdm పర్యవేక్షణ, లైబ్రరీ నిర్వహణ, క్రమశిక్షణ వంటివి ) ఎవరు చేయాలి...? ఉపాద్యాయులు తమ సబ్జెక్టు కు సంబంధిచిన పనులు చేసుకుంటూనే, పాఠశాల మొత్తానికి సంబంధించిన పైన పేర్కొన్న పనులన్నీ ప్రధానోపాధ్యాయులు కేటాయించిన మేరకు అందరూ చేయాలి. ప్రధానోపాధ్యాయులు లేకపోయినా, కేటాయించక పోయిన పాటశాల, పాఠశాల విద్యార్థులు శ్రేయస్సు దృష్ట్యా ఆ పనులు అందరూ తమ బాధ్యత గా చేయాలి. పాఠశాల నిర్వహణలో బాధ్యత సీనియర్ ఉపాద్యాయులదా, జూనియర్ ఉపాద్యాయులదా... ? పాఠశాల నిర్వహణలో సీనియర్, జూనియర్ అనేది ఉండకూడదు. అందరూ సమానమే. పరస్పర గౌరవం, అభిమానం తో , పరస్పర అవగాహన, స్నేహాభావన తో ఉపాద్యాయులు అందరూ పాఠశాల నిర్వహణ లో పాల్గొనాలి. సీనియర్ ఉపాద్యాయులు తన స్వీయ అనుభవాలను, ఆదర్శలను, అభిమానాన్ని జూనియర్ ఉపాద్యాయులకు పంచుతూ మార్గదర్శిగా ఉండాలి. జూనియర్ ఉపాద్యాయులు సీనియర్ ఉపాద్యాయుల పట్ల విధేయత కలిగి వారిని అనుసరిస్తూ తమ సహాయ సహకారాలు అందించాలి. కలసిమెలసి ఉపాద్యాయులు గా పాటశాల అభివృద్ధి కి బాధ్యత వహించాలి. పీరియడ్ ఉన్నప్పుడు విద్యార్థుల ను ఆడుకొమ్మని గ్రౌండ్ కు పంపవచ్చునా... ? అట్లు పంపరాదు. పీరియడ్ ఉన్నప్పుడు , విద్యార్థులను అడుకోమని గ్రౌండ్ కు పంపరాదు. అలా పంపాలనుకుంటే వారి వెంట ఉపాధ్యాయుడు కూడా గ్రౌండ్ కు వెళ్లి వారిని ఆడించడం లేదా పర్యవేక్షించడం చేయాలి. గ్రౌండ్ కు వెళ్లలేని పరిస్థితి ఉంటే సహా ఉపాద్యాయుని కి ఆ బాధ్యత అప్పగించడం చేయాలి. పాఠశాల వేళ ముగిసిన తర్వాత, పిల్లలు ఇళ్లకు వెళ్ళక ముందే పాఠశాల నుండి ఉపాద్యాయులు వెళ్లవచ్చునా... ? అలా వెళ్లకూడదు. పాఠశాల సమయం ముగిసిందని ఉపాధ్యాయులు విద్యార్థులు ఇళ్లకు వెళ్లకుండా ఉపాద్యాయులు ముందుగా ఇళ్లకు వెళ్లారాదు. పాఠశాల సమయం ముగిసిన తరువాత పాఠశాల కు హాజరైన విద్యార్థులు అందరూ తమ తరగతి గదులు నుండి , పాఠశాల ఆవరణ నుండి వెళ్లేంతవరకు వేచి ఉండాలి. పాఠశాల తరగతి గదులుకు తాళాలు వేయించి, విద్యార్థులు పాఠశాల ఆవరణ నుండి అందరూ వెళ్లారని నిర్ధారించుకొన్న తర్వాత మాత్రమే ఉపాద్యాయులు అందరూ పాఠశాల నుండి వెళ్ళాలి. పై విషయాలు ప్రతి ఉపాద్యాయుడు ఆత్మవలోకనం చేసుకొని మన విధులను సక్రమంగా నిర్వర్తించుదాం. విద్యార్థుల, వారి తల్లిదండ్రుల గౌరవాన్ని, అభిమానాన్ని పొందుతాం ఓబుల దేవర చెరువు ఎంఈఓ ఖాదర్ బాషా వలి తెలియజేశారు.
-----------------------
Admin