సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : ఒక బీసీ టిపీసీసీ అధ్యక్షుడుగా ఉంటే బిఅర్ఎస్ అధినాయకత్వం ఓర్వలేక పోతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ పేర్కొన్నారు.పిసిసి అద్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ను బిఆర్ఎస్ నాయకులు చిన్న చూపుగా మాట్లాడడాన్ని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫూలే విగ్రహానికి పాలభిషేకం చేశారు.ఈ సందర్భంగా లింగంగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినాయత్వం మహేశ్ కుమార్ గౌడ్ దమ్మును, కమిట్ మెంట్ ను చూసి రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు అప్పగించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు, జానపాటి రవి ఫరూక్, దోనేటి శేఖర్ సతీశ్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin