సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : బోనకల్లు మండల కేంద్రంలో సోమవారం నాడు పొంగులేటి అభిమానుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు బీఆర్ఎస్ పార్టీ పైన సంచనల వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్సార్ పార్టీ నుండి టిఆర్ఎస్ లో చేరినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని 2018లో మధిర టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ఎంతో కృషి చేసాం అని మధిర మున్సిపాలిటీని గెలిపించాం అని అన్నారు అదేవిధంగా నమ్ముకున్న నాయకులను కార్యకర్తలను అధికార పార్టీ నాయకులు అనేక ఇబ్బందులు పెడుతున్నారని జిల్లాలో ఏ శుభకార్యాలకు వెళ్లాలన్న స్థానిక ప్రజా ప్రతినిధుల అనుమతి తీసుకుని వెళ్లాలంట అని అన్నారు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని దుయ్యబట్టారు అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల హామీలను అమలు చేయాలని అధికారం ఎవడబ్బ సొత్తు కాదని బెదిరింపులకు భయపడేది లేదు దేనికైనా తగ్గేది లే అని రానున్న ఎన్నికల్లో శీనన్న అభ్యర్థులందరూ అందరూ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు...
-----------------------
Admin