సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : సర్కార్ న్యూస్ హనుమకొండలో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించేందుకు ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు ప్రయత్నించగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ముట్టడిని పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమాలు చేపడతామని విద్యార్థులు ఈ సందర్భంగా తెలియజేశారు విద్యార్థులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు
-----------------------
Reporter