సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : పుల్లలచెరువు మండలంలోని కొమరోలు, చాపల మడుగు మరియు ఎర్రగొండపాలెం మండలంలోని గుర్రపు శాల, వెంకటాద్రిపాలెం గ్రామాలలోని అంగన్వాడి కేంద్రాలలో పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ సుజాత మాట్లాడుతూ రాబోయే తరాలు ఆరోగ్యంగా జీవించాలంటే పౌష్టికాహారం తప్పనిసరి అని అన్నారు. ఈ విషయము అందరికీ తెలియాలి అంటే ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో పోషిక ఆహార వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు. పిల్లల్లో పోషిక ఆహార సమస్యలపై దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని పిల్లల్లో ఏడు నెలల నుంచి జావాలు కూరగాయలు పండ్లు పదార్థాలను గుజ్జుగా చేసి నా పదార్థాలు శిశువుకు రోజుకు రెండుసార్లు 250 మిల్లీలీటర్ల చొప్పున పిల్లలకు అందజేయాలని అదేవిధంగా 11 నెలలు లోపు చిన్నారులకు ఆహారం గుజ్జుగా చేసి రోజుకు మూడు దఫాలుగా చొప్పున అందజేయాలని అంగనవాడి సూపర్వైజర్ సుజాత అన్నారు. శరీరం శరీరం పెరుగుదలకు, గుండె పని, శరీర ఉష్ణోగ్రత మొదలైన వాటికి ఆహార వందిస్తూ ఉండాలని విటమిన్ ఏ లోపము వలన రే చీకటి, కార్నియల్, క్యూరోసిస్ వ్యాధుల నివారణకు పాలు, పాలపదార్థాలు, కూరగాయలు క్యారెట్, గుమ్మడి, పసుపు పచ్చ కూరగాయలు ఆకుకూరలు తీసుకోవాలని ఆమె అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడి సిబ్బంది, విద్య సిబ్బంది సాడ్స్ సంస్థ సిబ్బంది మంద మరి బాబు. గురవయ్య, ధర్మానాయక్. చిన్న బాబు సుధాకర్ పాల్గొన్నారు...
-----------------------
Admin