Thursday, 30 July 2026 04:01:28 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ కార్పొరేటర్లపై చిన్న చూపా...?

Date : 11 March 2023 11:57 PM Views : 940

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం లో కాంగ్రెస్ కార్పొరేటర్లపై చిన్న చూపా...? ????????స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కేటాయింపులో తీవ్ర అన్యాయం ????????ప్రతి పక్షాల డివిజన్ లో ప్రజల ఓట్లు అడగరా ! ????????అభివృద్ధి అంటే అధికార పార్టీ డివిజన్లేన ????????జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ ప్రతి పక్ష కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవ రెడ్డి భవనంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 50 కోట్ల రూపాయలను విడుదల చేసిందని అన్నారు. ఆ ఫండ్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల అభివృద్ధికి ఉపయోగించాల్సి ఉందని అందుకు అనుగుణంగా డివిజన్ కార్పొరేటర్ల సమక్షంలో ఆయా డివిజన్ కార్పొరేటర్ల కు నిధులు పంపిణి చేయాల్సి ఉందని అన్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్పొరేటర్ల డివిజన్ లకు, ఇండిపెండెంట్ కార్పొరేటర్ల డివిజన్ లకు నిధులు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. అభివృద్ధి అంటే అధికార పార్టీ కార్పొరేటర్ల డివిజన్లు మాత్రమే కాదని అన్ని డివిజన్లు అభివృద్ధి చెందినప్పుడే అసలైన అభివృద్ధి అని అన్నారు. కార్పొరేషన్ అభివృద్ధికి ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించిన దాన్ని అన్ని డివిజన్లకు సమానంగా పంచాలని విజ్ఞత లేదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులపై చిన్నచూపు చూస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అభివృద్ధి అనేది పార్టీలకతీతంగా ఉండలే తప్పా డివిజన్ కార్పొరేటర్లు అధికార పార్టీ వార కదా అని చూడ కూడదనే సోయి మంత్రి కి లేదా అని విమర్శించారు. ఇప్పుడు నిధులు కేటాయించకుండా రేపు ఆ డివిజన్ లో ఓట్లు ఏ మొఖం పెట్టుకొని అడుగుతారో మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిధులు మంజూరులో ఇప్పటికైనా తీరు మార్చుకొక పోతే కార్పొరేషన్ ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. అనంతరం 27వ డివిజన్ కార్పొరేటర్ మిక్కిలినేని మంజులనరేంద్ర మాట్లాడుతూ... మంత్రి ఖమ్మం నియోజవర్గానికి ఎమ్మెల్యే నా లేకపోతే అధికార పార్టీ డివిజన్లకే ఎమ్మెల్యే ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఏద్దేవా చేశారు. మేము కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వారిమేనని ఏ పాపం చేసామని ప్రతిపక్షాల డివిజన్లకు ప్రభుత్వ నిధులు కేటాయించడం లేదని విమర్శించారు. మా డివిజన్ ప్రజల అగ్రహానికి గురికాకముందే ప్రతిపక్షాల డివిజన్లకు వెంటనే నిధులు కేటాయించాలని లేదంటే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అనంతరం కార్పొరేటర్ దుద్దూకురి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలకు ప్రతి పక్ష పార్టీ కార్పొరేటర్ లను ఆహ్వానించకపోవడం రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమే అని అన్నారు. విలీన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని అన్నారు. ప్రభుత్వా అన్యాయాలను కరపత్రాల రూపంలో ప్రజలకు చేరవేస్తూ అక్రమాలను బయటపెడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో విరితోపాటు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య,జిల్లా మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్,కార్పొరేటర్లు పల్లెబోయిన భారతీచంద్రం,ముస్తఫారఫీదా బేగం,కోప్పెర సరితఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: