Sunday, 13 September 2026 10:56:42 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పంట పొలాలకు నీళ్లు ఇవ్వండి మహాప్రభో...

Date : 26 October 2023 04:48 AM Views : 686

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం : నీళ్లు నియామకాలు నిధులు అనే నినాదంతో ప్రజలను మభ్యపెట్టి వ్యవసాయ తెలంగాణ అని ప్రగల్బాలు పలికి దొరగారు, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నియామకాలు మాట దేవుడెరుగు . కానీ వ్యవసాయం కోసం నీరు అందించలేకపోయారు . వ్యవసాయం కోసం కొన్ని కోట్లు ఖర్చుపెట్టి వెంకటాపురం మండలలో కట్టించిన పాలెం ప్రాజెక్ట్ సమయానికి రైతులకు ఉపయోగం లేకుండా పోయింది . గత కొన్ని నెలలుగా వెంకటాపురం మండలం నూగురు గ్రామంలో సాగునీళ్లు అందక ప్రాజెక్టు నీరు చెరువులకు చేరక చెరువు ఆయకట్టు క్రింద ఉన్న వేల ఎకరాల పంట పొలాలు ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి. అని రైతులు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పొట్ట దశలో ఉన్న పంట పొలాలకు తప్పనిసరిగా నీరు అందించాల్సిన అవసరం ఉంటుందనీ ఈ సమయంలో నీరు పెట్టకపోతే పంట మొత్తం ఎండిపోయి భూమి బిటలు వారే పరిస్థితులు ఉంటాయని రైతులు వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నీరు లేక నెల రోజులు దాటిందని పాలెం ప్రాజెక్టు సుమారు 1250 టీఎంసీల నీటి నిలువ చేసే సామర్థ్యం ఉంటుందని ఇప్పుడు కనీసం 680 ఎం సి ఎఫ్ టి అయినా నీళ్లు ఉంటాయని ఈ నీలైన సక్రమంగా చెరువులకు పంపిస్తే పంటలు మళ్లీ చిగురించే అవకాశం ఉందని రైతులు పేర్కొన్నారు. ఈ విషయం పట్ల ఏ అధికారిని అడిగిన స్పందించట్లేదని మమ్మల్ని పట్టించుకునే నాధుడే లేడంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. నోటిదాక వచ్చిన పంట చేజారి పోతుంటే చూస్తూ ఉండి పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని, చివర పొట్ట దశలోనైనా సక్రమంగా నీళ్లు అందిస్తే కష్టపడైనా పంటను నిలుపుకొని పెట్టుబడి మందమైనా అప్పులు లేకుండా ఉంటామని రైతులు పత్రిక ముఖంగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా కుడికాలువకు ఎడమ కాలువకు పడ్డ గండీలు తక్షణమే పూడ్చి నుగురు చెరువు నింపే ప్రయత్నం చేయాలని ఆ గండిపడడం వల్ల నీరు వృధాగా మారి గోదావరిలోకి వాగుల్లోకి పోతున్నాయని వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ గండి పూడ్చడం వల్ల వచ్చే నీరు డైరెక్ట్ గా చెరువులోనే పడతాయని తద్వారా పంటలకు నీరు అందుతాయని. వారు తెలిపారు. ఇకనైనా ఉన్నత అధికారులు ఈ విషయం పట్ల రైతులకు సహకరించి అన్నం పెట్టే అన్నదాతను ఆదుకోవాలని వారు కోరారు. ప్రాజెక్టు ఎడమ కాలువ కుడి కాలువ మరమ్మత్తుల విషయమై. ఏఈ వివరణ : ఏఈ ని అడగగా తాము పై అధికారులకు చెప్పిన వాళ్ళు రావట్లేదని తమ చేతుల్లో ఏమీ లేదని . కాలువల మరమ్మత్తు పనులకు మనుషులని పంపిస్తామని ఎప్పటినుండో చెప్తున్నారని కానీ ఇంతవరకు పంపించలేదని ఏఈ తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :