సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ప్రజలకు నాణ్యమైన, సత్వర సేవలు ఒకే దగ్గర అందించాలని, పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవనం నిర్మాణ పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనసాగుతున్న పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 18న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో మిగులు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంకా చేపట్టాల్సిన పనులు వివరాలను అధికారులను అడిగి తెలసుకున్నారు. పనులను మరింత వేగం పెంచాల్సిన అవసరం ఉందని ఆదేశించారు. మిగులు చిన్న చిన్న పనులు, విద్యుత్ ఇతర చేపడుతున్న పనులు సమాంతరంగా చేపట్టాలని ఆయన అన్నారు. పనుల్లో మరింత వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, మేయర్ పునుకొల్లు నీరజ, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి, విద్యుత్, మునిసిపల్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin