సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం, సారపాక గ్రామపంచాయతీ పరిధిలోగల చంద్రయ్య గుంపు నందు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ నీలిమ ముఖ్య అతిథిగా విచ్చేశారు, సభను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ న్యాయ అవగాహన కలిగి ఉండాలని, గిరిజన వాసులైన మీరందరూ పోడు భూములపైన, అటవీ చట్టాల పైన అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏపీపీ దుర్గాబాయి మాట్లాడుతూ గిరిజనులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం వారు మీకు సహాయ సహకారాలు అందిస్తారని, దొంగతనాలు లైంగిక హత్యలు జరిగితే పోలీస్ వారిని సంప్రదించవచ్చని గిరిజనులకు తెలియజేశారు అదేవిధంగా న్యాయ అవగాహన సదస్సులో సీనియర్ న్యాయవాది ముత్యాల కిషోర్ చట్టాల పైన అవగాహన కలిగించారు. నిప్పు పట్టుకుంటే కాలుతుంది అనేది ఎంత నిజమో, చట్టానికి వ్యతిరేకంగా ఏమైనా పనిచేస్తే.. చట్టం మనల్ని శిక్షిస్తుంది అని గిరిజనులకు అర్థమయ్యే రీతిలో తెలియజేశారు. అదేవిధంగా న్యాయవాది తిరుమల రావు గిరిజనుల ఉద్దేశించి సుమారు 5 , 6 చట్టాల గురించి అవగాహన కల్పించారు , దాట్ల సంధ్య, రమాదేవి , జగదీష్ అడ్వకేట్లు సభను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సంతోష్ కుమార్ గిరిజనులతో ఎంతో ఐకమత్యంగా ఉంటూ, వారి కష్టా, నష్టాలు, బాగోగులు, అన్ని తెలుసుకొని వారికి ఎమ్మార్వో , ఎంపీడీవో ద్వారా కలెక్టర్ కు తెలియజేసి రోడ్లు, కరెంటు ఏర్పాటు చేపిస్తామని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో తాసిల్దార్ భగవాన్ రెడ్డి , ఎంపీడివో గిరిజన పెద్దలైన నరేందర్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin