Wednesday, 29 July 2026 04:54:37 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అర్హులైన వారందరికి పెన్షన్స్ ఇవ్వాలని డిమాండ్... - మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు

Date : 29 September 2022 08:56 PM Views : 621

సర్కార్ టీవీ న్యూస్ / పెద్దపల్లి జిల్లా : సుల్తానాబాద్ మండల కేంద్రంలో అర్హులైన వారందరికి పూర్తి స్థాయిలో పెన్షన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సుల్తానాబాద్ మండల ఎం.పీ.డీ.ఓ కి వినతి పత్రం ఇచ్చిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు మరియు ఎలిగేడ్ మండల కాంగ్రెస్ పార్టి శ్రేణులు.. 2018 డిసెంబరు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో కుటుంబంలో అర్హులైన ఇద్దరికీ 2016 రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటించిన తరువాత ప్రస్తుతం సీఎం కెసిఆర్ అలా ఎలా ఇస్తారని ప్రశ్నించి తాము కూడ 2016 రూపాయల పెన్షన్ ఇస్తామని తెలిపి పెన్షన్ అర్హత వయస్సును 57 సంవత్సరాలకు తగ్గించి ఇస్తామని మాయ మాటలు,మోసపూరిత మాటలు చెప్పి రెండవసారి ప్రభుత్వంలో వచ్చాక ఇప్పటివరకు నూతన పెన్షన్స్ గత 46 నెలల నుండి ఇవ్వకుండ మల్లి సంవత్సర కాలంలో ఎన్నికలు ఉంటాయని రాజకీయ కోణంలో ఆలోచించి 46 నెలల కాలంలోని పెన్షన్స్ ఎగ్గొట్టి ఇపుడు దరఖాస్తు చేసుకున్న వారిలో అందరికి ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారని, తెరాస సీఎం కెసిఆర్ ఎన్నికల హమీ ప్రకారం 2019 జనవరి నుండి ఇప్పటి వరకు పెన్షన్ బకాయిలను షుమారు 46 నెలల కాలానికి 92000 ఫై చిలుకు రూపాయలను అర్హులైన పెన్షనర్స్ అకౌంట్లో జమ చేయాలని కాంగ్రెస్ పార్టి పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పెన్షన్ తీసుకునే వ్యక్తి చనిపోతే రెండు మూడు నెలల వ్యవధిలో ఆ కుటుంబంలో అర్హులైన వారికి మళ్ళి పెన్షన్ సౌకర్యం కల్పించి ఆ కుటుంబాన్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుందని ఇపుడు తెరాస ప్రభుత్వం వచ్చాక విస్మరించిందని తెలియచేశారు. గత 4 సంవత్సరాల క్రింద నూతన పెన్షన్స్ దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆన్లైన్లలో సరిగ్గా నమోదు చేయడం కుదరక 46 నెలల నుండి జాప్యం చేసి ఇపుడు ఇవ్వడం ఎంత వరకు సమంజసం అని విజయరమణారావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రెండవసారి ప్రభుత్వంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం ఒక కుటుంబంలో ఒక్కరికి ఒక చేత్తో పెన్షన్ ఇస్తూ,ఆర్టీసీ ఛార్జీలు, రిజిష్ట్రేషన్ చార్జీలు,మద్యం ధరలు, కరెంటు చార్జీలు ఇలా అధిక ధరలను పెంచి మరొక చేత్తో వేలాది రూపాయలను తిరిగి తీసుకుంటుందని ప్రజలందరూ ఈ విషయాన్ని గ్రహించాలని విజయరమణారావు కోరారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో తెరాస పార్టి ఇచ్చిన హమీలు ఏవి అమలు కాలేదని అందులో నిరుద్యోగ భృతి 3016, రైతులకు లక్ష రూపాయల ఋణమాఫీ,డబల్ బెడ్ రూం ఇల్లు,దళితులకు మూడు ఎకరాల భూమి, 57 సంవత్సరాల పైబడిన అర్హులైన వారికి 4 సంవత్సరాల నుండి పెన్షన్స్ ఇవ్వకపోవటం ఇలా ఎన్నో మోసపూరిత మాటలతో ప్రభుత్వంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం ఇప్పటికయినా ఇచ్చిన హమీలను నెరవేర్చాలని నూతన పెన్షన్స్ ఇస్తున్నామని గొప్పలు చెప్పకుండా 2019 జనవరి నుండి ఇప్పటి వరకు 46 నెలల కాలనికి సంబందించిన రూపాయలను అకౌంట్లో జమ చేసి ప్రజల పట్ల చిత్తశుద్ధి నిరూపించుకోవాలని తెరాస ప్రభుత్వానికి నాయకులకు సూచించిన మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు వెగోళం అబ్బయ్య గౌడ్, మండల అధ్యక్షుడు చిలుక సతీష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంతటి అన్నయ్య గౌడ్, ఊట్ల వర ప్రసాద్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దన్నాయాక్ దామోదర్ రావు, మినుపాల ప్రకాష్ రావు, గొట్టం మల్లయ్య, ఎండి. రఫిక్,చింతల రాజు, పన్నాల రాములు, అమిరిశెట్టి రాయలింగు, కుమార్ కిషోర్, మేకల పోచాలు, అమిరుశెట్టి తిరుపతి, దన్నాయక్ శ్రీనివాస్, కోమరవేల్లి చక్రధర్, క్యాదాసు రవి, భూషనవేన శ్రీనివాస్, గడ్డం అనిల్, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :