సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ టౌన్ : భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు హాస్టల్ విద్యార్థులకు చలికి తట్టుకునే రగ్గులు ఇవ్వాలని ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు జగన్ సైదా నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో వచ్చిన తర్వాత సంక్షేమ రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి పేద విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారన్నారు రాష్ట్రంలో చలి విపరీతంగా పెరుగుతున్న కూడా చలికి తట్టుకునే రంగులను పంపిణీ చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు గత పది సంవత్సరాలు నుంచి హాస్టల్ విద్యార్థులకు పెట్టెలు ప్లేట్లు గ్లాసులు గత ప్రభుత్వం అందించకుండా విద్యార్థులను అన్యాయం చేసిందన్నారు కావున నూతన కాంగ్రెస్ ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు ప్లేట్లు పెట్టెలు గ్లాసులు తక్షణమే అందించాలని అన్నారు అద్దె భవనాల్లో ఉంటున్న గురుకుల సంక్షేమ హాస్టల్లకు సొంత భవనాలను నిర్మించాలని అన్నారు ప్రభుత్వం పెంచిన మెనూకు ప్రభుత్వం అందించాలని అంటున్న మెనూ పొంతన లేకుండా ఉందన్నారు కావున తక్షణమే ప్రభుత్వం నిర్దిష్ట మెనూ ను ప్రకటించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వీనర్ ప్రసన్న దామరచర్ల మండల కార్యదర్శి వీరన్న వేములపల్లి మండల కార్యదర్శి సంపత్ ఎస్ఎఫ్ఐ నాయకులు అనిల్ సూర్య శీను రవి సమీర్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin