Thursday, 30 July 2026 08:25:57 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో పేదింటి బిడ్డలు వసతి గృహాలలో ఉంటూ విద్యను అభ్యసించే వారి దృష్టిలో ఉంచుకొని డైట్ చార్జీలను కాస్మోటిక్ చార్జీలను పెంచడ

Date : 04 November 2024 12:00 AM Views : 529

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఆదివారం ములుగు జిల్లా కేంద్రము లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలిక హాస్టల్ ను మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పొరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., గ్రంథాలయ చైర్మన్ రవి చందర్ లతొ కలసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ 16 సంవత్సరాల తర్వాత పాఠశాల, వసతి గృహాలలో ఉండే విద్యార్థుల కాస్మోటిక్ చార్జీలను పెంచడం జరిగిందని, ఏడు సంవత్సరాల తర్వాత పిల్లలకు అందించే డైట్ చార్జీలను కూడా 40% పెంచడం జరిగిందని తెలిపారు. దీని ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి లభిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో పేదింటి బిడ్డలు వసతి గృహాలలో ఉంటూ విద్యను అభ్యసించే వారి దృష్టిలో ఉంచుకొని డైట్ చార్జీలను కాస్మోటిక్ చార్జీలను పెంచడం జరిగిందని, విద్యార్థులకు మంచి విద్యను అందించాలని ఉద్దేశంతో ఇంటర్నేషనల్ స్థాయి లో ఒకే చోట అందరి విద్యార్థులకు విద్యను అందించే దిశగా ప్రభుత్వం కార్యచరణ రూపొందిస్తుందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో విద్యావేత్తలు ఉంటే కుటుంబం, గ్రామం, సమాజం అభివృద్ధి బాటలో ముందుకెళ్తుందని తెలిపారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు జీవితంలో ఉన్నత ఆశయాలను వారి కుటుంబ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చుకునే లక్ష్యంతో ముందుకెళ్లాలని అన్నారు. వసతి గృహాలలో ఉండే విద్యార్థులు అనేక విజయాలను సాధిస్తూ ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని అలాంటి వారిని స్పూర్తిగా తీసుకొని ఉన్నత లక్ష్యాలను చేదించాలని మంత్రి సీతక్క , స్థానిక మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పొరిక బలరాం నాయక్ మేము వసతి గృహాలలో ఉంటూ విద్యను అభ్యసించామని విద్యార్థులకు గుర్తు చేశారు. వసతి గృహాలలో ఉండి విద్యను అభ్యసించే వారికి ఎన్నో అపోహలు ఉంటాయని కేవలం పేదవారు మాత్రమే వసతి గృహాలలో ఉంటూ విద్యను అభ్యసిస్తారు కావచ్చు అని ఒక అనుమానంతో ఉంటారని కానీ నిజానికి వసతి గృహాలలో ఉంటూ విద్యను అభ్యసించే విద్యార్థులకు ఎన్నో విషయాలు అర్థం చేసుకునే స్థాయి ఉంటుందని దాదాపు 500 మంది విద్యార్థులతో కలిసి ఉండటం వారితో వారి కుటుంబ పరిస్థితులను వారి యొక్క గ్రామాల పరిస్థితిలను చర్చించుకోవడం పట్ల సమాజంపై అవగాహన కూడా పెరుగుతుందని ప్రతి విద్యార్థి దశలో వసతి గృహంలో ఉన్న రోజులు మరుపురాని రోజులుగా ఉంటాయని పేర్కొన్నారు. పెరిగిన డైట్ చార్జీలతో విద్యార్థులకు పోషకాహారం అందించాల్సిన బాధ్యత టీచర్లకు, హాస్టల్ సిబ్బందికి ఉంద‌ని గుర్తు చేసారు. మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ తాను కూడా వసతి గృహాలలో ఉంటూ విద్యను అభ్యసించానని, వసతి గృహాలలో ఉండే సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని జీవిత ఆశయాలను నెరవేర్చుకోవడం కోసం కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. స్థానిక మంత్రి ధనసరి అనసూయ సీతక్క అసెంబ్లీ సమావేశాలలో విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని మెస్ చార్జీలను కాస్మోటిక్ చార్జీలను పెంచాలని మాట్లాడడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల వారి యొక్క విద్య సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని చార్జీలను పెంచడం జరిగిందని తెలిపారు. వసతి గృహాలలో ఉంటూ విద్యను అభ్యసించే విద్యార్థులు జీవిత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని , వసతి గృహాలలో ఉండే విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత లక్ష్యాలను కూడా సాధిస్తున్నారని అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు ముందుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థినీలు స్నానం చేయడానికి వేడి నీటి సౌకర్యం లేదని మంత్రి, ఎంపీ దృష్టి కి తీసుకెళ్లగా త్వరలో జిల్లా లోని వసతి గృహాల్లో వేడి నీటి సరఫరా చేయడం కొరకు సోలార్ వాటర్ సిస్టమ్ ను ఏర్పాటు చేయడానికి ఎం పి, ఎం ఎల్ ఏ నిధుల ద్వారా సమకూరుస్తమని మంత్రి, ఎం పి విద్యార్థినీ లకు హామీ ఇచ్చారు. విద్యార్థినులతో కలసి మంత్రి, ఎంపి, కలక్టర్ మధ్యహ్నం భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, ప్రిన్సిపాల్ నర్మదా, తహసిల్దార్ విజయ భాస్కర్, ఎం పి డి ఓ రామకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :