సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం కేంద్రంలో ఎంఈఓ ఆఫీసులో మండల విద్యాశాఖ అధికారులు శామ్యూల్ జాన్ మరియు ఎం జె ఇందిరా ప్రసాద్ అధ్యక్షతన ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి శామ్యూల్ జాన్ మాట్లాడుతూ మండలంలో కొత్తగా చేరిన విద్యార్థులందరికీ ఆన్లైన్ చేయాలని ఉపాధ్యాయులందరూ సమయపాలన పాటించాలని పాఠశాలలకు హాజరుకావాలని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం అందిస్తున్న పీఎం పోషణ మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన భోజనం అందించాలని మధ్యాహ్న భోజనం ఎలాంటి అత్యాశ లేకుండా నాణ్యమైన భోజనం లో ఎలాంటి తేడా లేకుండా చూసుకోవాలని ఏమైనా లోపం ఉంటే వెంటనే వారి పైన చర్యలు తీసుకోబడుతుందని ఆయన తెలియజేశారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి ఎం జె ఇందిరా ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం సప్లై చేస్తున్న స్టూడెంట్ కిట్టును విద్యార్థులందరికీ అందజేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు. ఎం యు ఆఫీస్ సిబ్బంది. సి ఆర్ ఎం టి లు పాల్గొన్నారు.
-----------------------
Admin