సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి మండలంలోని చౌటు తాండకు చెందిన ఎం శ్రీరాములు నాయక్ (50) శ్రీ అయ్యప్ప దర్శనానికి వెళ్లి వస్తూ తిరుగు ప్రయాణంలో తమిళనాడు రాష్ట్రం దిండిగుల్ జిల్లాలోని వేద సంధూర్ వద్ద సోమవారం రాత్రి రెండు గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తనకల్లుకు చెందిన మినీ బస్సు డివైడర్ ను ఢీకొని పల్టీలు కొట్టడంతో ప్రమాదం సంభవించినట్లు బస్సులోని అయ్యప్ప భక్తులు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారి అయ్యాడన్నారు. ఈ ప్రమాదంలో బస్సు ఓనర్ భాస్కర్ రెడ్డి తో పాటు ఒక అయ్యప్ప భక్తుడికి కాలు విరిగినట్లు సమాచారం. సంఘటన స్థలానికి కుంబూర్ పోలీస్ స్టేషన్ అధికారులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా డ్రైవర్ నిద్ర మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లనే ప్రమాదం సంభవించినట్లు బస్సులోని అయ్యప్ప భక్తులు తెలిపారు...
-----------------------
Admin