సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు చెల్లించాల్సిన బకాయిని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన యువ పోరాట యాత్ర అధికార పార్టీ గుండెల్లో రైలు పరిగెత్తిస్తుందని యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి అందే మోహన్ అన్నారు. రాష్ట్రంలో బుధవారం నుంచి యువజన కాంగ్రెస్ యువ పోరాట యాత్ర చేపట్టిందని మోహన్ మీడియాకు తెలిపారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్ నుంచి దీనిని ప్రారంభించామని, మొత్తం 33 జిల్లాల్లో 33 రోజుల పాటు నిర్వహించనున్నట్టు అందే మోహన్ తెలిపారు. జాతీయ అధ్యక్షుడు దేవి శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, మాజీ పిసిసి సభ్యులు పొన్నాల లక్ష్మయ్య గజ్వేల్ డీసీసీ అధ్యక్షులు నారాయణ గౌడ్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి యువత నిరుద్యోగులు పెద్ద ఎత్తున గజ్వేల్ తరలివచ్చారని ఆయన పేర్కొన్నారు. అదే మోహన్ మాట్లాడుతూ.. నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలను సక్రమంగా నిర్వహించడంలో విఫలమైందని అన్నారు. ఇటీవలి సంఘటనలతో టీఎస్పీఎస్సీ తన పవిత్రతను కోల్పోయిందని, ఉపాధి లేకుండా యువత ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిని అందించడంలో విఫలమైందనీ. దాని బకాయి రూ. ఒక్కో నిరుద్యోగికి 1.6 లక్షలు బకాయి కి చేరిందని అన్నారు. న్యాయం కోసం జరిగే పోరాటంలో మాతో చేతులు కలపాలని యువతను కోరుతున్నాం అని అందే మోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో తరుణ్ గౌడ్, రామకృష్ణ రెడ్డి, చంద్ర కాంత రెడ్డి, షాద్ నగర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఖదీర్, సోలిపూర్ రాజేష్ గౌడ్, నరేందర్, సాయి, వంశీ, సోలిపూర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.....
-----------------------
Admin