సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం తెలంగాణ రాష్టం ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమం బూర్గంపహాడ్ మండలం టేకులచెరువు పంచాయతీ లో గల మండల ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించటం జరిగింది, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బూర్గంపహాడ్ మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత గారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నారు, ఈ కార్యక్రమం లో ఉచితంగా పరీక్షలు చేసి తగిన కళ్లద్దాలు, మరియు మందులు అందిస్తున్నారు, కంటి వెలుగు కార్యక్రమం 6 నెలలు కొనసాగుంది, కంటి పరీక్షలు చెపించుకోవలిసిన వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాటు చేయాలని పంచాయతీ సిబ్బంది కోరటం జరిగింది, కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవతం చేయటానికి అందరు కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పారు, ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ భూక్యా సుజాత, గ్రామాకమిటి అధ్యక్షులు దర్గయ్య, భూక్యా శ్రీనివాస రావు, పెందెల వెంకటేశ్వర్లు, జక్కుల శ్రీనివాసరావు, నూకల బిక్షం, మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు...
-----------------------
Admin