Wednesday, 29 July 2026 08:13:02 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పాలకవీడు మండలం బొత్తల పాలెం గ్రామంలో వ్యక్తి అనుమానాస్పద మృతి ...

Date : 17 January 2024 08:39 AM Views : 634

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : డ్రైనేజీ లో అనుమానాస్పదంగా పడి ఉన్న మృతదేహం మండలంలో కలకలం రేపింది.వివరాలలోకి వెళితే సోమవారం రాత్రి బొత్తల పాలెం గ్రామానికి చెందిన ఎడ్ల పాండు(55 ) విగత జీవిగా డ్రైనేజీలోపడిఉండగా మంగళవారం తెల్లారుజామున స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక పాలకీడు మండల ఎస్సై లింగయ్య ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.విషయం తెలుసుకున్న హుజూర్ నగర్ సిఐ రామలింగారెడ్డి ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. మృతదేహం పక్కన సిసి రోడ్డుపై పడి ఉన్న రక్తపు మరకలను గుర్తించారు. పోలీసులు రక్తం నమూనాలను సేకరించారు. మృతుని భార్య చాలా కాలం క్రితం చనిపోయింది. పాండు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.ఒక కూతురు, కొడుకు, కూతురు నేరేడుచర్లలో ఉంటుంది ప్రస్తుతం ఆమె మాత్రమే వచ్చి పోలీసుల సహకారంతో హుజూర్ నగర్ పోస్టుమార్టంకి తండ్రి మృతదేహంతో వెళ్ళింది. స్థానిక పోలీస్ స్టేషన్ నుండి జవాన్ ని ఎస్సై పంపారు. మృతుని కుమారుడు అందుబాటులో లేడు. పాండు మృతి పై గ్రామస్తులు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు చనిపోతే మృతదేహం డ్రైనేజీ లోపలికి ఎలా వెళ్తుందని చర్చించుకున్నారు.సిసి రోడ్డుపై రక్తపు మరకలు ఉండడం, మృతదేహం డ్రైనేజీ లోపలికి నెట్టి ఉండటంపై గ్రామస్తులకు అనుమానాలు ఉన్నాయి.కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :