సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : సర్కార్ న్యూస్ ములుగు జిల్లా కేంద్రంలో బహుజన పూజారుల శివసత్తుల సేవాసమితి రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రతి గ్రామపంచాయతీ మరియు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అధిక సంఖ్యలో శివసత్తులు పోటీచేయాలని పిలుపునిచ్చారు బహుజన పూజారుల శివసత్తుల సేవాసమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బాబురావు మహారాజ్ భవిష్యత్ కార్యాచరణ చేయడం జరిగింది, ఈ సమావేశంలో బహుజన పూజారుల శివసత్తుల సేవా సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బాబురావు మహారాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలకు, ప్రీతికలు అయినా శివసత్తులకు, బహుజన పూజారులకు, సాధు, సంతులకు పదివేల జీవన భృతి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర పండుగలకు మూలాలైన శివశక్తులకు, బహుజన పూజారులకు ,ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి పాటుపడాలి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి చిన్న చిన్న గుళ్లకు బహుజన పూజారులకు, శివశక్తులకు ధూప, దీప, నైవేద్య పథకం అమలు చేయాలి వారికి ఎటువంటి నిబంధనలు లేకుండా స్థానిక పంచాయతీ కార్యదర్శి గారిచే గుర్తింపు ధ్రువపత్రాలు ఇచ్చి గుర్తింపు ఇచ్చి నిధులు, మంజూరు చేయాలి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రతి శివశక్తికి ప్రత్యేక శాఖ ద్వారా ఇవ్వాలి బహుజన పూజారులకు శివశక్తులకు, ప్రత్యేక ఆరోగ్యశ్రీ కార్డులను అమలు చేయాలి బహుజన పూజారులకు, శివశక్తులకు రెండు లక్షల రుణాలు మంజూరు చేయాలి ఎటువంటి వడ్డీ లేని ఎటువంటి షరతులు లేని రుణాలు ఇవ్వాలి వారికి శివశక్తులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలి గ్రామీణ ప్రాంతాలలో గుడి లేని, బడి లేని ,గ్రామాలు ఉండవచ్చు కానీ శివసత్తులు, బహుజన పూజారులు లేని గ్రామాలు లేవు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతున్న ఈ బహుజన పూజారులకు, శివశక్తులకు సాధు ,సంతులకు ఆదుకొని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శివశక్తులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా బహుజన పూజారుల సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని వేడుకుంటున్నాము ఈ కార్యక్రమంలో 33 జిల్లాల జిల్లా కమిటీ సభ్యులు ,రాష్ట్ర కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ములుగు, జిల్లా కమిటీ సభ్యులను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు వ్యవస్థాపక అధ్యక్షులు బాబురావు మహారాజ
-----------------------
Reporter