సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ఈ నెల 30 వ తారీఖు న కొల్లాపూర్ లో జరుగుతున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలనీ పిలుపు నిచ్చారు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వీర్లపల్లి శంకర్. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో వీర్లపల్లి శంకర్ అధ్యర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కొల్లాపూర్ లో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వస్తున్నారని అక్కడే మహిళా డిక్లరేషన్ గురించి చెపుతారని అన్నారు. ఇందుకు గాను షాద్ నగర్ నియోజకవర్గం నుండి సుమారు 2000 మహిళలు పెద్దఎత్తున సభకు బయలు దేరుతున్నారని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 8000 వేల మందితో సభకు పాల్గొంటామని మొత్తం 10,000 వేల మందితో సభకు బయలుదేరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకురాళ్లు అనసూయ, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin