సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ మండలంలోని కర్ని గ్రామంలో వివిధ శాఖల కార్యాలయాలలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాంప్లెక్స్ అధికారి రఘువీర్ నామాజీ మాట్లాడుతూ.... స్వాతంత్ర దినోత్సవ గొప్పతనాన్ని , స్వాతంత్ర సమర యోధుల గురించి విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థిని, విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా కాలంతో పోటీపడుతూ ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆయన అన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, పాఠాలు బోధించిన ఉపాధ్యాయులకు మరియు మన కర్ని గ్రామ పాఠశాలకు మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆయన కోరారు. 405 మంది విద్యార్థిని, విద్యార్థులకు 18 మంది ఉపాధ్యాయులు ఉండవలసిన మన పాఠశాలలో 06 గురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తూన్నామన్నారు. పేరెంట్స్ మీటింగ్ ఉన్న ప్రతిసారి పిల్లల తల్లిదండ్రులు, సంరక్షకులు మీటింగ్ కు తప్పక హాజరుకావాలని ఆయన సూచించారు. అనంతరం 03వ అంగన్వాడీ సెంటర్ ఉపాధ్యాయురాలు దామోళ్ల యశోద మాట్లాడుతూ... కర్ని గ్రామంలో ఇప్పటి వరకు 03 మెయిన్ అంగన్వాడీ సెంటర్లు 01 మినీ అంగన్వాడీ సెంటర్ ఉండగా.. ఒక్క సెంటర్ కు కూడా ప్రభుత్వ భవనం లేదని మా సమస్యలు దృష్టిలో పెట్టుకొని మా సెంటర్లకు ప్రభుత్వ భవనాలు నిర్మించేలా గ్రామ పంచాయతీ అధికారులు, గ్రామ పెద్దలు, యువకులు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలను పరిష్కరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అక్రమ్, ఉపసర్పంచ్ కృష్ణయ్య గౌడ్, ఎంపీటీసీ గాసం చిన్న రంగపప్ప, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం,రిటైర్డ్ వి అర్ ఓ పురుషోత్తం రావు, మకబుల్ పాషా, సూదర్శన్ శెట్టి, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin