Tuesday, 15 September 2026 09:06:48 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సైది రెడ్డి అబద్ధపు ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టలేరు... - ప్రధాన కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు గౌడ్

Date : 27 August 2023 06:34 AM Views : 390

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలో నాలుగు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని శానంపూడి సైదిరెడ్డి గొప్పలు చెప్పుకోవడం హస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ నల్గొండ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి హుజూర్ నగర్ నియోజకవర్ ఇన్చార్జి మండవ వెంకటేశ్వర్లు గౌడ్, వ్యాఖ్యానించారు. శనివారం హుజూర్ నగర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి మాటల్లో కనబడుతుందని, అలాగే నమస్తే తెలంగాణ దినపత్రికలో ఇచ్చిన ఇంటర్వ్యూలో కనపడుతుందని హుజూర్ నగర్ లో మాత్రం కనబడటం లేదన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని ఆయకట్టు ప్రాంతానికి సాగునీరు ఇప్పించలేని మీరు ఆర్భాటపు ప్రకటనలు ఇస్తూ ప్రజలను మోసం చేయాలనుకోవడం అవివేకం అన్నారు. నాలుగున్నర సంవత్సరాలు దాటిన హుజూర్ నగర్ పట్టణంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కానీ ,ఇల్లు గాని ఇప్పించలేకపోయారని విమర్శించారు. రోడ్ల వెడల్పులో నిర్వాసితులైనటువంటి నిరుపేదల ను ఆదుకోకుండా వారిని బజారుపాలన చేశారని విమర్శించారు. పాత బస్టాండ్ నుంచి అడ్డరోడ్డు వరకు ప్రధాన రహదారి గుంతలమయమై వానొస్తే మోకాళ్ళ లోతు నీళ్లతో వాహనదారులు , వ్యాపారులు పడుతున్న ఇబ్బందులు మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. లిక్కర్ మాఫియా , ల్యాండ్ మాఫియా , సాండ్ మాఫియా , బెల్టు షాపులలోనే హుజూర్ నగర్ అభివృద్ధి చెందిందే తప్ప ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి పలాలు అందుకోలేకపోతున్నారని అన్నారు. నియోజకవర్గం ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ పట్టణ పార్టీ అధ్యక్షులు కొమ్మ గాని వెంకటేశ్వర్లు గౌడ్ ,గరిడేపల్లి మండల పార్టీ అధ్యక్షులు కేసరి నాగయ్య ముదిరాజ్ , హుజూర్ నగర్ ,గరిడేపల్లి మండల పార్టీ ప్రధాన కార్యదర్శులు మీసాల సైదులు ,గుండు వెంకటేశ్వర్లు గౌడ్, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు చంద్రగిరి సాంబ, వల్లపు దాసు కోటయ్య గౌడ్ ,చింతలచెరువు శేఖర్ ,రాంబాబుతదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :