Wednesday, 29 July 2026 06:14:49 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వరంగల్ కమిషనరేట్ పరిధిలో నియంత్రణలో నేరాలు కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌

Date : 27 December 2025 08:43 PM Views : 219

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో నియంత్రణలో నేరాలు వున్నాయని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. శనివారం భీమారంలోని శుభం కళ్యాణ వేదికలో వరంగల్‌ సిపి వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వార్షిక నివేదిక 2025 సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా శాంతి భద్రతలకు సంబంధించి నివేదికలోని వివరాలను వెల్లడిస్తూ గత ఏడాదితో పోలిస్తే 0.53 శాతం స్వల్పంగా నేరాల పెరిగిందని గత ఏడాది 14,412 కేసులు నమోదు కాగా ప్రస్తుత సంవత్సరం 2025 లో 14,456 కేసులు నమోదు కావడం జరిగిందని నమోదు అయిన నేరాల్లో హత్య చేసిన దోపిడి కేసులు 4, దారి దోపిడీ 3, దోపిడిలు 16 కేసులు, దొంగతనాలు 355 కేసులు నమోదు కాబాడ్డాయి. హత్యలు 36, మానభంగాలకు సంబంధించి గత ఏడాది 145 కేసులు నమోదు కాగా ప్రస్తుతం సంవత్సరంలో 132 కేసులు నమోదు కాబడ్డాయని వీటితో పాటు వరకట్న మరణాలు, డొమెస్టిక్‌ నేరాలు, తగ్గు ముఖం పట్టగా, పోక్సో కేసులు గత ఏడాది 364 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 405 కేసులు నమోదు కాబడ్డాయని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. మహిళలపై నేరాలు తగ్గు ముఖం: గత ఏడాదితో పోలిస్తే 1504 కేసులు నమోదు కాగా, ప్రస్తుతం కేవలం 1453 కేసులు మాత్రమే నమోదు కావడం జరిగింది. దీనితో మొత్తం మీద 3.6శాతం మహిళలపై నేరాలు తగ్గు ముఖం పట్టాయని రూ.8 కోట్ల 62లక్షల విలువైన మత్తు పదార్థాలు పట్టివేత: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈఏడాదిలో 195 కేసుల్లో మొత్తం 482మందిని అరెస్టు చేయడంతో పాటు వీరిని నుండి 8.62 కోట్ల విలువగల ముత్త పదార్థాలను స్వాధీనం చేసుకోగా ఇందులో 1700 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, చోరీలకు సంబంధించి ఏడాదిలో మొత్తంలో దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 14 గ్యాంగ్‌లకు సంబంధించి, 33కేసులకు సంబంధించి 52 మంది నిందితులను అరెస్టు కాబడ్డారని, ముఖ్యంగా సిసిఎస్‌ విభాగం 84 చోరీ కేసుల్లో మొత్తం 79 లక్షల రూపాయల విలువ చోరీ సోత్తును పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్‌ కేసులకు సంబంధించి ఈ ఏడాది 1424 కేసుల్లో 430 మంది మృతి చెందగా, 1446 మంది తీవ్రంగా గాయపడ్డారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు 34,282 కేసులు నమోదు కాగా ఇందులో 887 మంది జైలు శిక్ష విధించడం జరిగింది. సైబర్‌ సైబర్‌ క్రైమ్‌ సంబంధించి 630 కేసులు నమోదు చేయబడ్డాయని సిపి తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 6040 కేసులు పరిష్కారం కాగా ఇందులో 2573 మందికి శిక్షలు ఖరారు కాబడ్డాయి. ఇందులో ప్రధానంగా 16 మందికి జీవితఖైదు శిక్ష పడగా, మరో ముగ్గురికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించబడిరది. గతే ఏడాది కంటే మూడు శాతం అధికంగా నేరస్తులకు శిక్షలు విధింబడ్డాయని ప్రధానం నేరాల నియంత్రణలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల పనితీరు అభినందనీయమని ఈ విభాగం వివిధ నేరాలకు సంబంధించి మొత్తం 418 కేసుల్లో 978 మంది అరెస్టు చేయడంతో పాటు సుమారు 14.80 కోట్ల రూపాయల స్వామగ్రి స్వాధీనం చేసుకున్నాట్లుగా పోలీస్‌ కమిషనర్‌ వెల్లడిరచారు. రాబోవు నూతన సంవత్సరంలో సమన్వయంతో పనిచేస్తూ ప్రజల సహకారం నేరాల నియంత్రణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, శాంతి భద్రతల పరిరక్షణే వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసుల ప్రధాన లక్ష్యమని సిపి తెలిపారు. ఈ కార్యక్రమములో డిసిపిలు రాజమహేంద్రనాయక్‌,కవిత,ఏ.ఎస్పీ చేతన్‌, అదనపు డిసిపి రవి, ప్రభాకర్‌, శ్రీనివాస్‌తో పాటు, ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు,ఆర్‌.ఐలు పాల్గోన్నారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :