Wednesday, 29 July 2026 06:47:46 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బిజెపి, బి ఆర్ ఎస్ పార్టీ లను ఓడించాలి... - సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

Date : 03 November 2023 07:54 AM Views : 340

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోబిజెపి,బిఆర్ఎస్ పార్టీలను ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మతోన్మాదంవిధానాలు అనుసరిస్తున్న బిజెపిని ఓడించాలని అన్నారు. గత పది సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నబిఆర్ఎస్ పార్టీని ఘోరంగా ఓడించాలన్నారు . సూర్యాపేట జిల్లాలో సిపిఎం పార్టీకి బలమున ఓటు బ్యాంకు కలిగి ఉన్న స్థానాలైన హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాలలో చేస్తామన్నారు. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలలో పోటీ గురించి త్వరలో చర్చించి చెబుతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత 17 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు తెలిపారు. మరో రెండు రోజుల్లో మిగతా స్థానాల తో పాటు పోటీ చేసే అభ్యర్థులను రాష్ట్ర కమిటీ ప్రకటిస్తుందన్నారు. ప్రశ్నించే గొంతులకు ప్రజలు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. చట్ట సభలలో కమ్యూనిస్టుల కు చోటు లేకపోవడం మూలంగా ప్రజా సమస్యలు చర్చకు రావడం లేదన్నారు. కమ్యూనిస్టు అభ్యర్థులు చట్ట సభలలో ఉండటం మూలంగా కార్మికుల, రైతుల, ఉద్యోగ, ఉపాధ్యాయ,మహిళల, యువకుల, దళిత గిరిజన బడుగు బలహీనవర్గాల సమస్యలపై గళం ఎత్తటానికి అవకాశం ఉంటుందన్నారు. రానున్న ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులకు అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దిరావత్ రవి నాయక్, బుర్రి శ్రీరాములు, మట్టి పెళ్లి సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, నగరపు పాండు, చెరుకు ఏకలక్ష్మి, కోట గోపి, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :