సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండల కేంద్రంలో శుకువారo జీవో నెంబర్ వన్ రద్దును హైకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల బుక్కపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి *శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాధమిక హక్కులను,రాజ్యాంగ భావ ప్రకటనా స్వేచ్ఛను హరించేందుకు తీసుకుని వచ్చిన జివో నెంబర్ 1 కొట్టివేత ప్రజాస్వామ్య శక్తుల విజయం ఫ్యాక్షన్ పాలనపై ప్రజాస్వామ్యం గెలిచింది పాదయాత్ర,ర్యాలీ,సభలకు ఆటంకం కలిగించడం ఇక సరికాదని ప్రభుత్వం, పోలీసులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి, చిన్న ఉద్యమం చేసినా ఈ ప్రభుత్వం సహించడం లేదు కనుక ప్రశాంతంగా నిరసన తెలిపే హక్కు ప్రజలకు,ప్రతిపక్షాలకు ఉందని ప్రజాస్వామ్యంలో హిట్లర్, ముసోలిన్ వంటి నియంత పాలన శాసనాలు చెల్లవుకనుక ముఖ్యమంత్రి కూడా ఇందుకు అతీతుడు కాడు.జివో నెంబర్ వన్ అడ్డం పెట్టుకొని రాక్షస పరిపాలన చేద్దామని కలలు కన్న ముఖ్యమంత్రి కలలు హైకోర్టు చెంప పెట్టు ఇకనైనా రాజ్యాంగాన్ని చట్టాలను గౌరవించి పరిపాలన చేయాలని వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలు,టౌన్ కన్వీనర్ జంగం వెంకట్రాముడు,మైనార్టీ స్పోక పర్సన్ అబ్దుల్ వాజీద్ భాష,నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు లావణ్య గౌడ్,నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు బుల్లె సుధీర్,మండల మైనార్టీ అధ్యక్షులు కలీం భాష,పుట్టపర్తి టౌన్ ప్రధాన కార్యదర్శి అమ్మినేని కేశవ నాయుడు,బుక్కపట్నం రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సామకోటి ఈశ్వరయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్నప్ప, కేశవ, వెంకటేష్, కేసప్ప, చెన్నకేశవులు,కిష్టా,లింగప్ప గారి పల్లి రవి,టిడిపి పిట్లా రమణ,గిరక కేశవ గొర్ల కృష్ణ తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
-----------------------
Admin