సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : *ఏఐటియుసి ఆధ్వర్యంలో అదరహో అనిపించిన ప్రపంచ కార్మికుల దినోత్సవం* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండల పరిధిలోగల సారపాక లో అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (మే డే) ను ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఐ టి సి పి ఎస్ పి డి గేటు ఎదురుగా ఉన్నటువంటి స్థూపం వద్ద జెండాను ఆవిష్కరించారు. అనంతరం సారపాక ప్రధాన కూడలి వద్ద మరియు ఏఐటీయూసీ కపర్తి భవన్ అదేవిధంగా మరికొన్ని పరిసర ప్రాంతాలలో రక్తం చిందించిన అమరవీరులను గుర్తు చేసుకుంటూ ఎర్రజెండాను ఎగురవేశారు. మే డే రోజున నిర్వహించిన కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు సింగమనేని ప్రసాద్ మాట్లాడుతూ ఎనిమిది గంటల పని దినం కోసం కార్మికవర్గ డిమాండ్లకు మద్దతుగా గొప్ప అంతర్జాతీయ ప్రదర్శన కోసం ఒక తీర్మానాన్ని ఆమోదించింది . 1886 మే 1న ప్రారంభమై మే 4న హేమార్కెట్ వ్యవహారంలో ముగిసిన యునైటెడ్ స్టేట్స్‌లో జరిగిన సార్వత్రిక సమ్మెను స్మరించుకోవడానికి అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ ఈ తేదీని ఎంచుకుంది అని ఆయన తెలియజేశారు. సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ అధ్యక్షుడు మాట్లాడుతూ ఎనిమిది గంటల పని దినాన్ని చట్టబద్ధంగా స్థాపించడానికి, శ్రామికవర్గం యొక్క డిమాండ్ల కోసం మరియు సార్వత్రిక శాంతి కోసం మే మొదటి తేదీన అన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ సంస్థలు మరియు అన్ని దేశాల ట్రేడ్ యూనియన్లు శక్తివంతంగా ఇచ్చే ప్రదర్శనే మే డే అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసిఐటిసి ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు మహమ్మద్ సాజిద్,ప్రధాన కార్యదర్శి సింగమనేని ప్రసాద్, గౌరవ సలహాదారులు తన్నేరువెంకటేశ్వర్లు, స్వామి గౌడ్, పారుపల్లి శ్రీనివాస్, సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ అధ్యక్షుడు పేరాల శ్రీనివాస్, సీనియర్ నాయకుడు ప్రజానాట్యమండలి కోటమర్తి శ్రీనివాస్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బల్లెం నాగయ్య, ప్రధాన కార్యదర్శి షేక్ జహూర్, సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాయల నవీన్, జనరల్ సెక్రటరీ పత్యం ఉపేందర్ మహిళా కార్మికురాలు లక్ష్మి, భవన నిర్మాణ అధ్యక్ష కార్యదర్శులు శివ, వెంకటేశ్వర్లు, పార్టీ సీనియర్ నాయకులు గంట నరసింహారావు, రెడ్డి, లక్ష్మి, సీత, శివ, తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter