Sunday, 13 September 2026 03:29:00 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ లో ది అడ్వకేట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ బ్రాంచ్ ప్రారంభం...

Date : 25 July 2023 05:11 PM Views : 450

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో న్యాయవాదుల బాగోగుల కోసం అన్ని విధాల సహకరించేందుకు నూతనంగా ది అడ్వకేట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ బ్రాంచ్ ప్రారంబించడం సంతోషంగా ఉందని రంగారెడ్డి అడిషనల్ డిస్టిక్ట్ అండ్ సేషన్ జడ్జ్ (ఎడిజే) వై. జయ ప్రసాద్ అన్నారు. షాద్ నగర్ కోర్టు సముదాయంలో నూతనంగా సోమవారం స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్ రావు ఆధ్వర్యంలో అడ్వకేట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ బ్రాంచ్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ సేషన్ సివిల్ జడ్జ్ సిఎం రాజ్యలక్ష్మి, జూనియర్ సివిల్ జడ్జి సూరజ్ సింగ్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ధీరజ్ కుమార్, జిల్లా సొసైటీ అధ్యక్షులు రాజీవ్ రెడ్డి, ప్రభుత్వ లీడర్ కంచి రాజగోపాల్ తదితర స్థానిక న్యాయవాదులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్జ్ జయ ప్రసాద్ మాట్లాడుతూ.. కోపరేటివ్ సొసైటీ సేవలను అందరూ న్యాయవాదులు సకాలంలో వినియోగించుకోవాలని సూచించారు ఇది ఎంతో మంచి అవకాశం అని న్యాయవాదులకు కోఆపరేటివ్ సొసైటీ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా చెప్పారు. షాద్ నగర్ సేషన్ సివిల్ జడ్జ్ సిఎం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. కోఆపరేటివ్ సొసైటీ ద్వారా న్యాయవాదులకు అన్ని విధాల లాభం చేకూర్చుతుందని దేవాదులతో పాటు వారి కుటుంబాలకు కూడా ఎంతో ఈ సేవలు ఉపయోగపడతాయని ఆమె చెప్పారు. షాద్ నగర్ లో కోపరేటివ్ సొసైటీ బ్రాంచ్ ను ప్రారంభించుకోవడం పట్ల న్యాయవాదులకు శుభాభినందనలు తెలిపారు. స్థానికంగా న్యాయవాదులు ప్రజలకు ఎన్నో సేవలు చిత్తశుద్ధితో అందిస్తున్నారని ఈ సందర్భంగా ఆమె న్యాయవాద వృత్తి గురించి అభినందించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :