సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం, మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివి ..... జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళా దుర్గా ప్రసాద్, అన్నారు. జాతీయ కాంగ్రెస్ లో ఉంటూ దేశ స్వాతంత్య్రం కోసం మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు మరువలేనివని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళా దుర్గా ప్రసాద్ అన్నారు. బుధవారం ఆయన 65వ వర్ధంతి పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ కార్యా లయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ..... మహాత్మా గాంధీకి మరియు సహాయ నిరాకరణ ఉద్యమానికి మద్దతునిస్తూ, మౌలానా ఆజాద్ జనవరి 1920లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారని అన్నారు. సెప్టెంబరు 1923లో కాంగ్రెస్ ప్రత్యేక సమావేశానికి అధ్యక్షత వహించారని, కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన అతి పిన్న వయస్కుడిగా చెప్పబడ్డారని కొనియాడారు. మౌలానా ఆజాద్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమైన జాతీయ నాయకుడిగా ఎదిగారని అతను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సభ్యునిగా మరియు ప్రధాన కార్యదర్శి మరియు అధ్యక్ష కార్యాలయాలలో అనేక సందర్భాలలో పనిచేశాడని గుర్తు చేశారు. 1928లో మోతీలాల్ నెహ్రూ రూపొందించిన నెహ్రూ నివేదికను మౌలానా ఆజాద్ ఆమోదించారని, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మోతీలాల్ నెహ్రూ నివేదికను స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది ముస్లిం వ్యక్తులు తీవ్రంగా విమర్శించారు. ముహమ్మద్ అలీ జిన్నాకు వ్యతిరేకంగా, ఆజాద్ కూడా మతం ఆధారంగా ప్రత్యేక ఓటర్లను ముగించాలని వాదించారని అన్నారు. లౌకికవాదానికి కట్టుబడి ఒకే దేశం కోసం పిలుపునిచ్చారన్నారు. 1930లో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా ఉప్పు చట్టాలను ఉల్లంఘించినందుకు మౌలానా ఆజాద్‌ను అరెస్టు చేసీ ఏడాదిన్నర పాటు మీరట్ జైలులో ఉంచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నియోజకవర్గ పిసిసి సభ్యులు, జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, నగర కాంగ్రెస్ కార్పొరేటర్లు లకావత్ సైదులు నాయక్, మలీదు వెంకటేశ్వర్లు, నగర బీసీ సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నగర మైనారిటీ అధ్యక్షులు అబ్బాస్, భోజడ్ల సత్యనారాయణ, ఎంపీటీసీ నల్లమోతు లక్ష్మయ్య, నగర కాంగ్రెస్ నాయకులు రజీ,బాలాజి, నాగేశ్వరరావు, రవి, గడ్డo వెంకటయ్య, రజి, నాగేశ్వరరావు,మహమూద్, రి యాజ్,సురేష్, ఇబ్రహీం,జహీర్,నూకారపు వెంకటేశ్వర్లు ,కొట్టే ప్రసాద్, క్రిష్ణయ్య,వెoకటనారాయణ,తలారి నాగభూషణo తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin