సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో అదనపు ఎస్పి నాగేశ్వరరావు, డి ఎస్ పి నాగభూషణం, సి ఐ రాజశేఖర్ లతో కలిసి కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే ఐపిఎస్ గంజాయి నివారణలో జిల్లా పోలీసు పటిష్టంగా పని చేస్తుంది, పూర్తి సమాచారంతో గంజాయి సరఫరా చేసే వారిని గుర్తించి అరెస్ట్ లు చేస్తున్నాము దీనిలో భాగంగా సూర్యాపేట పట్టణం లో తనిఖీ చేస్తుండగా గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను జాతీయ రహదారి పై ఈనాడు ఆఫీస్ వద్ద గుర్తించి అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి1.5 కేజీల గంజాయి సీజ్ చేసి ఎన్ డి పి ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు వివరించారు.నిందితులకు గంజాయి అమ్మడం, త్రాగటం అలవాటు ఉన్నది, గత నేర చరిత్ర కలిగి ఉన్నారు అని ఎస్పి అన్నారు. గంజాయి సంబంధ కేసుల్లో ఉంటే భవిష్యత్తులో ఉద్యోగాలు, పాస్ పోర్టు ల విషయంలో సమస్యలు వస్తాయి. కళాశాలల వద్ద వీటి పై దృష్టి పెట్టాలి అన్నారు. నిందితుల వివరములు రోషన్ కుమార్ సింగ్, తెలనాగి మురుగేష్, మొహమ్మద్ అంజద్ పాషా. అను వ్యక్తులను అరెస్టు చేసి కోర్టులో ఆధార పరుస్తామని తెలిపారు...
-----------------------
Admin