సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : నర్వ మండలం కేంద్రంలో యాంకె గ్రామంలో భారత విద్యార్థి ఫెడరేషన్ SFI జిల్లా కమిటీ ల ఆధ్వర్యంలో ఆత్మకూర్ టు నర్వకు ఆర్టీసీ బస్సులు నడపాలని ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా SFI వనపర్తి జిల్లా సహాయ కార్యదర్శి కె రాఘవ, నారాయణపేట SFI జిల్లా ఉపాధ్యక్షులు KM.మహేందర్ లు మాట్లాడుతూ ఆత్మకూర్ టు నర్వ రాయి కోడ్ ఆర్టీసీ బస్సులు లేక చాలామంది విద్యార్థులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పాఠశాలకు కళాశాలకు పోయే విద్యార్థులు ఆర్టీసీ బస్సులు లేక చదువులకు, సంత మార్కెట్ లకు దూరం అవుతున్నారు గత ఆరు నెలల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఆర్టిసి బస్ డిపో అధికారులకీ ఈ సమస్యలు తెలిసినప్పటికీ ఏమాత్రం స్పందించక పోవడం లేదు. ఇప్పటికైన తక్షణమే వనపర్తి ఆర్టీసీ బస్సు అధికారులు వెంటనే స్పందించి ఆత్మకూర్ టు నర్వకు బస్సులు నడపాలని డిమాండ్ చేశారు లేదంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విధ్యార్థులు ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ SFI మండల నాయకులు రమేష్, రాఘవేంద్ర, జ్యోతి, మల్లేశ్వరి, అరుణ్, ఉమా, కావేరి, అమూల్య విద్యార్థులు గ్రామ ఉప సర్పంచ్ ప్రతాప్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin