సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ : పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు పూర్తిగా అండగా ఉంటామని,సమ్మె విజయవంతానికి తమ వంతు కృషి చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు.శనివారం తహశీల్దార్ కార్యాలయం వద్ద 3వ రోజు కొనసాగిస్తున్న దీక్షకు మద్దతు తెలియజేశారు.ఈసందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని,వారికి ఈపీఎఫ్,ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని,ప్రతీ ఆదివారం సెలవు దినం ప్రకటించాలని,పండుగలకు సెలవు ఇవ్వాలని,11వ పీఆర్సీ ప్రకారం ప్రతీ కార్మికులకు 25 వేల రూపాయలు ఇవ్వాలని,చనిపోయిన కార్మికుల దాహన సంస్కారాల కోసం 30 వేల రూపాయలు ఇవ్వాలని,జీఓ 51ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేనియెడల ప్రత్యక్ష కార్యక్రమాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,స్వేరోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకబత్తిని వీరయ్య,పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్,అసెంబ్లీ మహిళా అధ్యక్షురాలు కోలా మల్లికా,కేతిని కుమారి,కాటబోయిన వసుంధర తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin