సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భారతీయ జనతా పార్టీ, భద్రాచలం మండల శాఖ ఆధ్వర్యంలో ప్రజా గోష - బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా శక్తి కేంద్ర ఇన్చార్జి పీసీ కేశవ్ అధ్యక్షతన స్థానిక పాత మార్కెట్ రోడ్డు నందు శక్తి కేంద్ర స్ట్రీట్ కార్నర్ మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా బీజేపి రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కుంజా సత్యవతి మాట్లాడుతూ..... తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ కుటుంబ అరాచక పాలన అంతమయ్యే సమయం వచ్చిందని, కమిషన్ల అవినీతి తెలంగాణ నుండి పారదర్శక బంగారు తెలంగాణకు బాటలు వేయగలిగే శక్తి ఒక్క భారతీయ జనతా పార్టీకే ఉంది అని, అందుకే రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం బీజేపీకే ఓటు వేసి అప్పుల పాలైన తెలంగాణని, అభివృద్ధి పథంలో బంగారు తెలంగాణ దిశగా నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబాద్ పార్లమెంట్ కన్వీనర్ ముసుగు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నిడదవోలు నాగబాబు, మండల అధ్యక్షులు రామ్మోహన్రావు, మహిళా మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ముక్కెర కోటేశ్వరి, మండల ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన వెంకన్న, ఉపాధ్యక్షులు సూరత్ సుదర్శన్, గడ్డం శ్రీహరి, ముత్యాల శ్రీనివాస్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు దేవరపల్లి వెంకటేశ్వర్లు, గిరిజన మోర్చా మండల అధ్యక్షులు పేరం ఉపేందర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు గొర్రుముచ్చు జయరాజు, బీజేవైఎం జిల్లా నాయకులు మునిశెట్టి నిఖిల్, మండల అధ్యక్షులు అన్నం హరీష్, మణికంఠ సత్తి, ఎస్ఎల్ఎన్ శర్మ, కొంజర్ల ముక్తేశ్వరరావు, అన్నం సాయి, లక్ష్మణ్ వత్సవాయి, రామకృష్ణంరాజు, పోలింగ్ బూత్ అధ్యక్షులు అనుబోజు గణేష్ చారి, బిఎస్ నారాయణ, సీనియర్ నాయకులు సత్యనారాయణ, మహిళా మోర్చా నాయకురాలు ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin