సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ పిలుపులో భాగంగా ఈరోజు షాద్ నగర్ నియోజక వర్గంలో ఉన్నటువంటి స్కూళ్లను బందు చేసే క్రమంలో ముందుగానే పోలీసులు మొహరించి విద్యార్థి సంఘాల నాయకులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు ఎం. పవన్ చౌహన్ ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు శివ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో, జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని, ప్రతి ఒక్క విద్యార్థికి పాఠ్యపుస్తకాలు అందించాలి అలాగే యూనిఫామ్స్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కోరారు. నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యూనివర్సిటీలలో విసీలను నియమించాలని పెండింగ్లో ఉన్నటువంటి 4.3వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లకు సొంత బిల్డింగ్లను నిర్మించాలని నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంధు పిలుపునిచారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనికి విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే విద్యార్థి సంఘాల డిమాండ్లను పరిష్కరించలి లేదు అంటే వచ్చే ఎలక్షన్స్ లో విద్యార్థుల సత్త చూపిస్తామని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకాన్ని ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని హెచ్చరించారు. అరెస్టు అయిన వారిలో ఏఐఎస్ఎఫ్ నాయకులు నరేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు యాదగిరి, నరేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin