Thursday, 30 July 2026 02:43:21 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు...

Date : 06 January 2026 12:18 PM Views : 697

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి సెలవులను ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఆదేశాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు వరుసగా సెలవులు రానున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జనవరి 10 నుంచి జనవరి 16 వరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. తిరిగి జనవరి 17 శనివారం పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. నిజానికి అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెలవులు ఉన్నప్పటికీ, జనవరి 16న కనుమ పండుగను ఐచ్ఛిక సెలవుగా ప్రభుత్వం గుర్తించింది. అయితే పండుగ మరుసటి రోజే కావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల సౌకర్యార్థం జనవరి 16 వరకు సెలవులను పొడిగిస్తూ డైరెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.తాజా ఉత్తర్వులతో మరోక అదనపు హాలిడే యాడ్ అవ్వడంతో మొత్తం 7 రోజులు సంక్రాంతి సెలవులు వచ్చాయి. రాష్ట్రంలోని అన్ని మేనేజ్‌మెంట్ల ప్రభుత్వ, ప్రైవేట్, గురుకులాలు కింద నడిచే పాఠశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని విద్యాశాఖ ప్రకటించింది.....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :