సర్కార్ టీవీ న్యూస్ / కాకినాడ జిల్లా : కిర్లంపూడి మండలం బూరుగుపూడి లో కిర్లంపూడి మండలం తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీటీసీ సభ్యులు పాఠం శెట్టి రవి ఆధ్వర్యంలో శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పిలుపుమేరకు బూరుగుపూడి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పవిత్రతకు భంగం కలిగించిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు ఎప్పుడో బుద్ధి చెప్పారని అయినప్పటికీ వారిలో మార్పు రాలేదని జగన్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ లు అన్య మతస్తులు తప్ప హిందువులు పనికిరాని వారు ప్రశ్నించారు. ఎంతో పవిత్రతతో హిందువులు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించే లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వును కలపటం చాలా తీవ్రమైన చర్యగా వారు అభివర్ణించారు. తక్షణమే దోషులను శిక్షించాలని సిట్ అధికారులు విచారణ తొందరగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కర్నాకుల పెద్దకాపు, పాఠం శెట్టి మీసాల నాగేశ్వరరావు, బాలుకుల చిన్నోడు, కన్ని శ్రీను, పాఠంశెట్టి బూరయ్య, కర్రీ ప్రకాశరావు, జనసేన నాయకులు పాఠంశెట్టి రమేష్, కర్నాకుల సూరిబాబు, పాఠం శెట్టి సూరిబాబు, కర్ణాకుల సత్తిబాబు, బిజెపి నాయకులు బాలిన వెంకటేశ్వరరావు, ఏర్రియ్య, పెద్ద కృష్ణ, బాబి, హరి తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు....
-----------------------
Admin