సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండల మున్నూరు కాపు సంఘం కార్యాలయంలో అత్యవసర సమావేశం ఆదివారం నిర్వహించారు . తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై గుండాల దాడిని ఖండిస్తూన్నట్లు ,ప్రజా శ్రేయస్సు కొరకు ప్రజా సమస్యల మీద నిత్యం పోరాడుతున్న వ్యక్తి సోదరుడు ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి నిరంతరం ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కి వెళ్లి ప్రజాక్షేత్రంలో పోయిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక దశలో తీన్మార్ మల్లన్న గెలుపుకు దగ్గరగా వచ్చిన వ్యక్తి అన్నారు. పార్టీలకతీతంగా వర్గాలకు అతీతంగా ఈ సందర్భంగా క్యు న్యూస్ మేనేజ్మెంట్ వారికి స్టాప్ కి తీన్మార్ మల్లన్న కి సంఘీభావం ప్రకటించారు. అందరం ఐక్యంగా ముందుకు వెళ్దామని తెలిపారు. బూర్గంపహాడ్ మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మరియు సారపాక గ్రామ కమిటీ అధ్యక్షులు పెద్దలు తోట శివయ్య ఈ పిరికి చర్యను ఖండిస్తున్నాట్లు, భవిష్యత్తులో వారు అందరూకూడా ఇటువంటి వాటిని ఎదుర్కొని కుల పరంగా ఐక్యంగా ఉందామన్నారు.
-----------------------
Admin