సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని సమ్మె చేస్తున్నారు. 8 వ రోజు గురువారం గ్రామపంచాయతీ సిబ్బంది సిఐటియు జిల్లా సభ్యులు సయ్యద్ రణమియా ఆధ్వర్యంలో డప్పులు కొట్టుకుంటూ, ర్యాలీగా బయలుదేరి , మఠంపల్లి మెయిన్ సెంటర్లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి, పూలమాలలు వేసి, గ్రామపంచాయతీ సిబ్బంది డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ రణమియా మాట్లాడుతూ గ్రామపంచాయతీ సిబ్బంది న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని అన్నారు. మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, జీవో నెంబరు 60 ప్రకారం జీతాలు చెల్లించాలని. కారో బార్ బిల్లు కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని వారు పేర్కొన్నారు. అదేవిధంగా సీనియారిటి ప్రకారం రెగ్యులర్ చేయాలని, సర్పంచ్, కార్యదర్శుల, జాయింట్ ఖాతాలను రద్దుచేసి, తమ సొంత ఖాతాలలో నే జీతాలు వేయాలని, గ్రామపంచాయతీ సిబ్బందికి ఇన్సూరెన్స్ బీమా 10 లక్షలు కల్పించాలని, అదేవిధంగా ఈ ఎఫ్, పిఎఫ్ లను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది అధ్యక్షులు ఇంటి రవి, ఉపాధ్యక్షులు ధరావత్ మోతిలాల్, ప్రధాన కార్యదర్శి, మంగళ పల్లి మైసయ్య, మేడి దేవదానం, గుర్వ రెడ్డి, వెంకటయ్య, దావీదు, సంతోషం, కోటే శ్వరి ,సైదా, వీరస్వామి, బాలాజీ నరసింహారెడ్డి, బి వెంకటేశ్వర్లు, నాగయ్య, నాగలక్ష్మి,పాండు, మీసాల నాగబాబు, అమీద్, అంజి,బురి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin