Sunday, 13 September 2026 12:16:53 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ, మౌన ప్రదర్శన

Date : 27 July 2023 11:00 AM Views : 527

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ప్రధాని మోడి ఒక వర్గానికి ప్రధాన మంత్రిగా వ్యవరిస్తున్నారంటూ షాద్ నగర్ క్రైస్తవులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రైస్తవ సోదరి, సోదరులు ర్యాలీ మౌన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తాసిల్దార్ కు మెమోరాండం అందించారు. దేశ ప్రధాని తన ప్రసంగంలో భాయో ఔర్ బహనో అనే సంబోధిస్తాడు తప్ప ఆచరణలో పాటించడు అనటానికి నిదర్శనమే మణిపూర్ సంఘటన అంటూ క్రైస్తవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని ఉండి మహిళల పట్ల ఇంత అరాచకం జరుగుతున్న మౌనం వహించడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నిస్తున్నారు. అదే సంఘటన వారి అక్కకు, చెల్లెకు అయ్యుంటే ఇలాగే స్పందిస్తారా అంటూ నిలదీస్తున్నారు. అరాచకాలు హింసను ప్రేరేపిస్తున్న వారిని ఉపేక్షిస్తే సహించేది లేదంటున్నారు. సుప్రీంకోర్టు స్పందించిందే కానీ దేశ ప్రధాని, రాష్ట్రపతి మౌనంగా ఉన్నారని వెంటనే పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ సి పి డబ్ల్యూ ఏ అధ్యక్షుడు రెవరెండ్ ఎస్. జోసఫ్ అంజన్న, ఉపాధ్యక్షుడు డానియల్ రాజ్, కార్యదర్శి స్వామి దాస్, కోశాధికారి అభిషేక్ అబ్రహం, పాస్టర్ ఎస్. డేవిడ్, పాస్టర్ ఎస్. నవీన్ కుమార్, జియోన్ ఎంబి చర్చ్ పాస్టర్ కృష్ణపాల్, జియోన్ ఎంబి చర్చ్ చైర్మన్ డాక్టర్ రెవరెండ్ జి.జె జ్ఞానప్రకాష్, వైస్ చైర్మన్ బిల్లీగ్రామ్, కార్యదర్శి గడిపే జోసఫ్ (జోషి), కోశాధికారి ఏజ్కేల్, అసిస్టెంట్ కోశాధికారి రాజేష్, ఎ.జి. లాజరస్, సంపత్, సుధీర్, రవితేజ, శ్రీకాంత్, కొందుర్గు మండల అధ్యక్షుడు పాస్టర్ ఆగిరాల రవి, పాస్టర్ మురళి, పాస్టర్ దేవయ్య, పాస్టర్ టి. రవి, పాస్టర్ జోసఫ్ ఫ్రాంక్లిన్, పాస్టర్ ఆశీర్వాదం, పాస్టర్ ఈశ్వరయ్య, పాస్టర్ వీరబాబు, శంషాబాద్ మండల అధ్యక్షుడు పాస్టర్ గ్లోరీ బాబు, షాబాద్ మండల అధ్యక్షుడు ఎంఎం సామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: