Wednesday, 29 July 2026 06:31:29 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్

Date : 02 December 2025 08:53 PM Views : 157

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : *ఈనెల 5న నర్సంపేటలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి పర్యటనను విజయవంతం చేయాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు యూత్ కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్ అన్నారు..* *నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ పెద్దలు శ్రీ దొంతి మాధవరెడ్డి గారి ఆశీస్సులతో నర్సంపేట స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేడు జరిగిన యుత్ కాంగ్రెస్ సమావేశంలో నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్ గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో విద్యా, వైద్యం, రోడ్లు, త్రాగునీరు, సాగునీరు, మరియు పలు ప్రభుత్వ రంగ సంస్థల భవనాల నిర్మాణాలను చేపట్టి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలనే గొప్ప సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి వారిని ఒప్పించి మెప్పించి నియోజకవర్గ అభివృద్ధికీ 1000 కోట్ల నిధులను తీసుకొచ్చి ఈనెల 5న సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల శంకుస్థాపన పనులను ప్రారంభోత్సవం చేసుకోబోతున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేస్తున్నానని అన్నారు, నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి గారి మొదటి సభను విజయవంతం చేయవలసిందిగా యూత్ కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు, అదే విధంగా నియోజకవర్గంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకు యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రమించాలని రాష్ట్రంలోనే అత్యధిక సర్పంచ్ స్థానాలను మన నియోజకవర్గంలో గెలిపించుకొని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి గౌరవ ప్రతిష్టలు రాష్ట్రవ్యాప్తంగా చాటే బాధ్యత ప్రతి యూత్ కాంగ్రెస్ నాయకుడిపై ఉందని గుర్తు చేశారు..* *ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రెటరీ మోడెం ఎల్లగౌడ్, వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రూపిక శ్రావణ్ కుమార్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పల్స ప్రశాంత్ గౌడ్, నర్సంపేట పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్కే షఫిక్, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, చెన్నారావుపేట మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద నరేష్, ఖానాపూర్ మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బొల్లం హరీష్, యూత్ కాంగ్రెస్ నాయకులు గద్ద అఖిల్, మహమ్మద్ సల్మాన్, దేశి సాయి పటేల్, మచ్చకంటి మనోజ్ కుమార్, మంచాల హరీష్, గద్ద నిఖిల్, అరుణ్, తదితరులు పాల్గొన్నారు..*

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :