సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మహిళ జర్నలిస్టు తులసి చందు కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి కోరారు.ప్రజల పక్షంగా ఉండి తన జర్నలిజం వృత్తిని ఆధారం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న తులసి చందును కొంతమంది మతోన్మాద శక్తులు ఇష్టానుసారంగా దుర్భాషలాడటం మహిళలను కించపరచడమే,భావ ప్రకటన స్వేచ్ఛను కాల రాయడం అవుతుందని వెంటనే అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని యాదగిరి డిమాండ్ చేశారు.ఆమె ఉన్న వాస్తవాలను సమాజం దృష్టికి తీసుకొచ్చినప్పుడు అందులో పొరపాట్లు ఉంటే అందుకు తగిన విధంగా స్పందించాలి గాని మహిళా జర్నలిస్టును పట్టుకొని నానా దుర్భాషలాడటం బూతులు తిట్టడం ఇంకా పలు రకాలుగా బెదిరించడం మానవత్వం అనిపించుకోదని మహిళలను గౌరవించుకునే మంచి సంప్రదాయం భారతదేశంలో ఉండగా ఒక విలువైన జర్నలిజం లో ఉన్నటువంటి మహిళా సోదరిని తమ సోదరిగా భావించి సహకరించేది పోయి ఆమెను మానసికంగా వేదనకు గురి చేయడం సిగ్గుచేటు అన్నారు. తులసిచందుకు మానవత్వం ఉన్న ప్రతి భారతీయుడు అండగా నిలవాలని అదేవిధంగా జర్నలిజం సమాజం తులసిచందుకు అండగా ఉంటుందని తెలిపారు.తులసి చందు ధైర్యంగా ఉండి జర్నలిజం లో వస్తున్న అవరోధాలను ఎదిరించాలని అందరికీ ఆదర్శప్రాయంగా విరోధులకు చెంపపెట్టుగా తన జర్నలిజం వృత్తిని కొనసాగించాలని యాదగిరి తెలిపారు.ప్రభుత్వాలు ప్రభుత్వాధికారులు ప్రజా ప్రతినిధులు పోలీసులు ప్రజలు ప్రతి ఒక్కరు తులసిచందుకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు
-----------------------
Admin